Viral Video: ఇది నిజమా? గ్రాఫిక్సా?.. రాయి మీద నీళ్లు పోయగానే షాక్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
ABN, Publish Date - Apr 08 , 2024 | 03:19 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉండి చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటిల్లో ఏది నిజమో, ఏది నకిలీదో తెలుసుకోవడం మాత్రం చాలా కష్టంగా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉండి చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటిల్లో ఏది నిజమో, ఏది నకిలీదో (Fake Video) తెలుసుకోవడం మాత్రం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అది నిజమో, అబద్ధమో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
son of earth అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కప్ప (Frog) ఆకారంలో ఉన్న బొమ్మలాంటిది ఉంది. దానిని ఓ వ్యక్తి పట్టుకుని చూశాడు. అది రాయిలా గట్టిగా ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి గ్లాస్‌తో నీరు తీసుకుని ఆ రాయి మీద పోశాడు. అలా నీళ్లు పోయగా ఆ రాయి కాస్తా కప్పలా మారిపోయింది. రెండు గెంతులు గెంతి టేబుల్ మీద నుంచి కిందకు వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. 2.8 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ వీడియో నిజమని కొందరు అంటుంటే, మరికొందరు ఇది ఫేక్ అంటున్నారు. ``ఈ వీడియోను ఎవరో అద్భుతంగా ఎడిట్ చేశారు``, ``ఫేక్ వీడియోతో వ్యూస్ కోసం ట్రై చేస్తున్నారు``, ``ఇది నిజమే కావొచ్చు. కొన్ని కప్పలు ఆరు నెలల పాటు అలా మారిపోతాయి``, ``ఏదైనా ఆపద వచ్చినపుడు కాపాడుకునేందుకు కప్పలకు దేవుడు ఇచ్చిన వరం అది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Health: వండే ముందు బియ్యం కడుగుతున్నారా? అలా వండితే ఆరోగ్యానికి ఎంత హానికరం అంటే..
Updated Date - Apr 08 , 2024 | 03:19 PM