ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్త శాలరీ ఇదా!? జనాల ఆశ్చర్యం!

ABN, Publish Date - Jun 29 , 2024 | 09:07 PM

ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్త శాలరీ ఎంతో తెలుసుకుని జనాలు షాకైపోతున్నారు. దేశం కోసం పాటుపడే శాస్త్రవేత్తల శాలరీ ఇంకా ఎక్కువ ఉండాలని అనేక మంది కామెంట్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశాభివృద్ధి కోసం ప్రత్యక్షంగా పనిచేసే అరుదైన అవకాశం. భారత దేశ పేరు ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల శాలరీ విషయంలో మాత్రం దేశ వాసులు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇస్రోలో ప్రాథమిక స్థాయిలో పనిచేసే యువ శాస్త్రవేత్తల శాలరీ అంశం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బ్రోక్ బ్రదర్స్ చేసిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా (Viral) మారింది.

Viral: కడుపుతో ఉండి కూడా ఇదేంటి తల్లీ.. మహిళ పనికి షాక్‌లో నెటిజన్లు!

స్ట్రీట్ ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బ్రోక్ బ్రదర్స్ ఛానల్. ఇందులో వ్యాఖ్యాతలు వీధుల్లో కనిపించే వివిధ రకాల వ్యక్తులను స్వల్పకాలిక ఇంటర్వ్యూలు చేస్తూ జనాలతో పంచుకుంటారు. ఆర్థిక అంశాలే ప్రధానంగా ఈ ఛానల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే, తాజాగా వారు ఇస్రో శాస్త్రవేత్తను ఇంటర్వ్యూ చేశామని చెప్పారు. ఇక ఇంటర్వ్యూలోని వ్యక్తి మాట్లాడుతూ ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్తల శాలరీ నెలకు లక్ష ఉంటుందని చెప్పుకొచ్చారు. సీటీసీ 15 లక్షల దాకా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. ఇస్రోలో ఉద్యోగం పరంగా బాగా నచ్చే అంశం కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ అని చెప్పుకొచ్చాడు. దీని ద్వారా మంచి ఆసుపత్రుల్లో ఉచితంగా ట్రీట్‌మెంట్ పొందొచ్చని అన్నారు (Isro entry level scientist salary becomes hot topic of discussion in social media).


అయితే, జనాలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘‘ఇస్రో చైర్మన్ శాలరీనే నెలకు రెండున్నర లక్షలని ఎక్కడో చదివాను. అలాంటి ప్రాథమిక దశలోని శాస్త్రవేత్తకు లక్ష శాలరీ ఉంటుందా.. మహా అయితే.. నెలకు 55 వేలతో పాటు అదనపు అలవెన్సులు కొన్ని ఉండొచ్చు’’ ఓ నెటిజన్ అని చెప్పుకొచ్చారు. దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న శాస్త్రవేత్తల శాలరీ మరింతగా పెంచాలని అనేక మంది డిమాండ్ చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 29 , 2024 | 09:07 PM

Advertising
Advertising