Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నీటిలోనే మొసలికి కళ్లు బైర్లు కమ్మే షాకిచ్చిన జాగ్వార్.. వీడియో వైరల్..
ABN, Publish Date - Sep 20 , 2024 | 09:07 AM
ఎంత పెద్ద ఏనుగైనా నీటిలో మొసలి బలం ముందు నిలువలేవు. సింహాలు, పులులు కూడా నీటిలోని మొసలిని చూసి భయపడతాయి. నీటిలోని మొసలి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవు. దానికి చిక్కకుండా ఉండేందుకే ప్రయత్నాలు చేస్తాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ జాగ్వార్ మాత్రం సత్తా చూపించింది.
ఎంత పెద్ద ఏనుగైనా నీటిలో మొసలి (Crocodile) బలం ముందు నిలువలేవు. సింహాలు, పులులు కూడా నీటిలోని మొసలిని చూసి భయపడతాయి. నీటిలోని మొసలి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవు. దానికి చిక్కకుండా ఉండేందుకే ప్రయత్నాలు చేస్తాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని ఓ జాగ్వార్ (Jaguar) మాత్రం చెరువులోకి దిగి మొసలి స్టైల్‌లోనే ఓ మొసలిని వేటాడింది. మొసలికి పట్టు దొరక్కుండా చేసి దాని పీక పట్టుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. jaguarecologicalreserve అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మొసలి సరస్సు ఒడ్డున ఉంది. నీటి అడుగు నుంచి ఈత కొట్టుకుంటూ అతి మెల్లిగా ఓ జాగ్వార్ అక్కడకు చేరుకుంది. అప్రమత్తంగా ఉన్న మొసలిపై అకస్మాత్తుగా దాడి చేసింది. మొసలి కూడా ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. అయితే జాగ్వర్ బలం ముందు మొసలి తలవంచక తప్పలేదు. మొసలి పీక పట్టుకున్న జాగ్వార్ గట్టిగా పట్టు బిగించింది. ఆ మొసలిని ఒడ్డు వైపు ఈడ్చుకెళ్లిన జాగ్వార్ ప్రాణాలు పోయే వరకు వదల్లేదు. ఈ ఘటన మొత్తాన్ని ఓ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 78 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``జాగ్వార్ నీటి అడుగు నుంచి రావడం అద్భుతం``, ``మొసలిని నీటిలోనే వేటాడడం.. సాధారణ విషయం కాదు``, ``జాగ్వార్ పవర్ సామాన్యమైనది కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..
Viral: నా అందమే నా పాలిట శ్రతువుగా మారింది.. ఆవేదన వెళ్లగక్కిన హాట్ మోడల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 20 , 2024 | 09:07 AM