ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: బాస్.. ఇక మీరు తప్పించుకోలేరు.. ఉద్యోగం కోసం ఓ వ్యక్తి అప్లయ్ చేసిన తీరు చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN, Publish Date - Jul 10 , 2024 | 10:03 AM

మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. నచ్చిన కంపెనీలో ఉద్యోగం కోసం ఎన్నో రోజులు వెయిట్ చేస్తారు. పలు సార్లు ఉద్యోగం కోసం అప్లై చేస్తారు. అయినా ``నో వేకెన్సీస్`` అంటూ కంపెనీలు చాలా సార్లు తిరస్కరిస్తాయి. ఆ వ్యక్తికి కూడా మూడు సార్లు అలాంటి అనుభవమే ఎదురైంది.

Strange job application

మంచి జీతంతో (Salary) కూడిన ఉద్యోగం (Job) సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. నచ్చిన కంపెనీలో ఉద్యోగం కోసం ఎన్నో రోజులు వెయిట్ చేస్తారు. పలు సార్లు ఉద్యోగం కోసం అప్లై చేస్తారు. అయినా ``నో వేకెన్సీస్`` అంటూ కంపెనీలు చాలా సార్లు తిరస్కరిస్తాయి. ఆ వ్యక్తికి కూడా మూడు సార్లు అలాంటి అనుభవమే ఎదురైంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి నాలుగో సారి అప్లయ్ చేశాడు. ఆ వ్యక్తి సేకరించిన సమాచారం చూసి కంపెనీ యాజమాన్యానికే దిమ్మదిరిగిపోయింది. ఈ జాబ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).


ఒక వ్యక్తి ఓ కంపెనీలో అకౌంటెంట్ (Accountant) ఉద్యోగం కోసం దరఖాస్తు (Job Application) చేసుకున్నాడు. ఇప్పటికే మూడు సార్లు తిరస్కరణకు గురయ్యాడు. అకౌంటెంట్ పోస్ట్‌ ఖాళీ లేదంటూ ఆ కంపెనీ చెబుతూ వచ్చింది. ఇటీవల ఆ కంపెనీ అకౌంటెంట్ మరణించాడు. దీంతో ఆ వ్యక్తి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సారి చాలా పకడ్బందీగా సమాచారం సేకరించి జాబ్ అప్లికేషన్ రూపొందించాడు. తన రెజ్యూమ్‌తో పాటు అకౌంటెంట్ మరణించిన విషయాన్ని, తన సంతాప సందేశాన్ని కూడా జత చేశాడు. అంతేకాదు ఆ అకౌంటెంట్ మరణించాడనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి అతడి అంత్యక్రియలకు కూడా హాజరయ్యానని అందులో పేర్కొన్నాడు.


ఈ సారి తన అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసేందుకు ఎలాంటి అవకాశమూ లేదని, కచ్చితంగా తనకు జాబ్ ఇవ్వాల్సిందేనని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ జాబ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ లక్షల్లో వ్యూస్ దక్కించుకుంది. 67 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ఇంతకీ అతడికి ఉద్యోగం వచ్చిందా``, ``అతడికి ఈ సారి కూడా జాబ్ ఇవ్వకపోతే మరోసారి ఆ పోస్ట్ ఖాళీ అవుతుంది``, ``అతడు ఉద్యోగం అడగడం లేదు, డిమాండ్ చేస్తున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ వ్యక్తిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు.. బైక్‌తో సహా వరదలో చిక్కుకున్నా అతడేం చేస్తున్నాడో చూడండి..


Viral Video: బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది.. ఈ మహిళలు వాడుతున్న టెక్నిక్‌లు చూస్తే మతి పోగొట్టుకోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 10:03 AM

Advertising
Advertising
<