ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బైక్‌పై టైటానిక్ పోజ్ ఇచ్చాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

ABN, Publish Date - Jun 09 , 2024 | 12:38 PM

నేటితరంలోని యువతపై సోషల్ మీడియా ప్రభావం పీక్స్‌లో ఉంది. వాస్తవ జీవితానికి దూరంగా.. ఇంటర్నెట్‌లోనే కాలం గడిపేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. నెట్టింట్లో వైరల్ అవ్వాలన్న..

Kanpur Man Titanic Pose On Moving Bike

నేటితరంలోని యువతపై సోషల్ మీడియా (Social Media) ప్రభావం పీక్స్‌లో ఉంది. వాస్తవ జీవితానికి దూరంగా.. ఇంటర్నెట్‌లోనే కాలం గడిపేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. నెట్టింట్లో వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో రకరకాల వీడియోలు పోస్టు చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం.. అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తమ చర్యల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటామని తెలిసి కూడా హద్దుమీరుతుంటారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే హద్దుమీరడంతో.. పోలీసులు అతనికి తగిన గుణపాఠం నేర్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


కాన్పూర్‌లోని నవాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంగా బ్యారేజ్‌పై ఓ యువకుడు అత్యంత వేగంగా బైక్ నడిపాడు. అంతటితో ఆగకుండా.. బైక్‌పై నిల్చొని టైటానిక్ తరహాలో పోజ్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో.. ఆ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన) కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. అతను నడిపిన బైక్ ఉన్నావ్‌లో రిజిస్టర్ అయినందున స్థానిక పోలీసులు అతనిపై రూ.12,000 జరిమానా విధించారు.


ఈ ఘటనపై కాన్పూర్ పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ బైక్ స్టంట్ వీడియో వైరల్ అవ్వడంతో తమ దృష్టికి వచ్చిందని, అధికారులు వెంటనే దీనిపై ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు నమోదు చేశారని అన్నారు. నంబర్ ప్లేట్ వివరాల ద్వారా.. ఉన్నావ్‌లో రిజిస్టరై ఉండటంతో ఎంవీ యాక్ట్ కింద పెనాల్టీ వేయడం జరిగిందన్నారు. కాగా.. గతంలో పోలీసు అధికారుల ఎదుట బైక్‌పై ప్రమాదకరమైన స్టంట్‌ చేసినందుకు.. అధికారులు అతనికి రూ.5 వేలు జరిమానా విధించారు.

Read Latest Viral News and Telugu News

Read more!

Updated Date - Jun 09 , 2024 | 12:38 PM

Advertising
Advertising