Karl Rock: అమెరికా ప్లేన్‌లో ఇచ్చే ఫుడ్‌ను టేస్ట్ చేసిన ఫారినర్.. వెంటనే ఇండియన్ పుడ్ గుర్తొచ్చి..
ABN, Publish Date - Feb 27 , 2024 | 04:57 PM
భారతీయ ఫుడ్, అమెరికా ప్లేన్‌లో సర్వ్ చేసిన ఫుడ్ పోలుస్తూ కార్ల్ రాక్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియాలో విదేశీ టూరిస్టుల ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతున్న తరుణంలో ఇక్కడి వంటకాల గొప్పదనం చెప్పే ఓ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో (Trending) ఉంది. పాప్యులర్ యూట్యూబర్ కార్ల్ రాక్ దీన్ని (Karl Rock) షేర్ చేయడం మరో విశేషం. విమానంలో సర్వ్ చేసిన అమెరికా ఆహారాన్ని (American food) భారతీయ వంటకాలతో (Indian food) పోల్చిన కార్ల్ తన అభిప్రాయాన్ని ఫ్రాంక్‌గా చెప్పేశాడు (Comparision).
Viral: దేవుడా.. గర్ల్‌ఫ్రెండ్ పేరును ఒంటిపై ఎక్కడ టాటూ వేయించుకున్నాడో చూస్తే..
‘‘తొలిసారిగా ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నా. మరి అమెరికా ఫుడ్ బెటరో ఇండియా ఫుడ్ బెటరో ఓసారి చూద్దాం. నేను ఇండియా నుంచి బయలుదేరాను. ఈ ఫుడ్ చూడండి.. ఇది ఎకానమీ క్లాస్‌లో కంటే బెటర్‌గానే ఉంది. బ్రేక్ ఫాస్ట్ కూడా బానే ఉంది. నేను ఎంజాయ్ చేశాను’’ అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత రిటర్న్ జర్నీలో అతడు అమెరికా విమానంలోని ఫుడ్ టేస్ట్ చేయగానే అంతకుముందు తిన్న ఇండియన్ ఫుడ్యే గుర్తొచ్చింది. దీంతో తన అభిప్రాయాన్ని వీడియోలో పంచుకున్నాడు. ‘‘రబ్బర్లా సాగుతున్న చికెన్, ప్లెయిన్ రైస్, రుచి లేని ఫుడ్. ఇది అమెరికన్ ఫుడ్ అంటే డౌటొస్తోంది. ఇది జైల్లో పెట్టే ఫుడ్ లాగా ఉంది’’ అని కామెంట్ చేశాడు.
ఈ వీడియోకు నెట్టింట పెద్ద రెస్పాన్సే వచ్చింది. ఇప్పటివరకూ జనాలు రకరాల కామెంట్స్ చేశారు. ఇండియా గురించి కార్ల్ మంచి అభిప్రాయం చెప్పడం ఆహ్వానించదగ్గదే. అతడిని ఇండియా బాగా మార్చేసింది.’’ అని ఒకరు కామెంట్ చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన కార్ల్ రాక్ నిత్యం భారత్‌పై అనేక టూరిజం వీడియో చేస్తాడన్న విషయం తెలిసిందే. గతంలో అతడి వీడియోలు కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 27 , 2024 | 05:09 PM