Viral Video: ఇదేందయ్యా ఇదీ.. నిజమా? మాయా?.. కీ బోర్డ్‌తో కారును ఎలా కంట్రోల్ చేస్తున్నాడో చూడండి..
ABN, Publish Date - Nov 17 , 2024 | 09:42 AM
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే డ్రైవర్ల అవసరమే ఉండదని చెబుతున్నారు. అయితే ఓ వ్యక్తి చాలా వినూత్నంగా ఆలోచించి కారును హాయిగా నడుపుతున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అది నిజమా? మాయా? అనేది అర్థం కావడం లేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
ప్రస్తుత ఆధునిక సమాజంలో అద్భుతాలకు కొదవ లేదు. రోజుకో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే డ్రైవర్ లెస్ కార్లు (Driverless cars) చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చేశాయి. కొన్ని చోట్ల కార్లను, ఇతర వాహనాలను రోబోలు డ్రైవింగ్ చేస్తున్నాయి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే డ్రైవర్ల అవసరమే ఉండదని చెబుతున్నారు. అయితే ఓ వ్యక్తి చాలా వినూత్నంగా ఆలోచించి కారును హాయిగా నడుపుతున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అది నిజమా? మాయా? అనేది అర్థం కావడం లేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
ehsanzafarabbasi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వాహనాలతో బిజీగా ఉన్న రోడ్డు మీద ఓ కార్ వెళ్తోంది. అయితే ఆ కార్ డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేరు. కానీ, స్టీరింగ్ మాత్రం అటూ ఇటూ తిరుగుతోంది. వెనుక సీట్లో ఓ వ్యక్తి కీ బోర్డ్ పట్టుకుని కూర్చున్నాడు. అతడు కీబోర్డ్ ద్వారా ఆ కారును ఆపరేట్ చేస్తున్నాడు. కీబోర్డ్ ఆధారంగా ఆ కారు స్టీరింగ్‌ను అటూ ఇటూ తిప్పి హాయిగా నడుపుతున్నాడు. వాహనాలతో నిండి ఉన్న రోడ్డు మీదే అతడు ఇలాంటి ప్రయోగాన్ని నిర్వహించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5.4 కోట్ల మందికి పైగా వీక్షించారు. 33 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రపంచంలోనే మొట్టమొదటి కీబోర్డ్ ఆపరేటింగ్ కారు``, ``ఇతని కోసం ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు``, ``బ్రేక్ వేయడం, గేర్ మార్చడం ఎలా``, ``తప్పుడు కీ ఎంటర్ చేస్తే యాక్సిడెంట్ అవడం ఖాయం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral: తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఎక్స్ రే చూసి నివ్వెరపోయిన డాక్టర్..
Optical Illusion Test: మీది హెచ్‌డీ చూపు అయితే.. ``8``ల మధ్యనున్న ``3``ను 3 సెకెన్లలో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 17 , 2024 | 09:42 AM