ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి మూడు పాములను ఎలా బయటకు వదులుతోందో చూడండి.. !

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:16 AM

నాగుపాములకు ఆకలి వేస్తే తమ జాతికి చెందిన జీవులనైనా మింగేస్తాయని చెబుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే అది నిజమని నమ్మక తప్పదు. తాజాగా ఓ నాగుపాము మూడు ఇతర పాములను మింగేసింది. అందులో ఒక భారీ సర్పం కూడా ఉంది. వాటిని అరగించుకోలేక బయటకు వదిలేసింది.

King Cobra is seen pulling out the swallowed snakes

ఈ ప్రపంచంలో అత్యధిక మంది పాములంటేనే (Snake) భయపడతారు. పాములున్నాయంటే చాలు అటువైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది అత్యంత ప్రమాదకరమైన నాగుపాము (King Cobra)ను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాములు ఆకలి వేస్తే తమ జాతికి చెందిన జీవులనైనా మింగేస్తాయని చెబుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే అది నిజమని నమ్మక తప్పదు. తాజాగా ఓ నాగుపాము మూడు ఇతర పాములను మింగేసింది. అందులో ఒక భారీ సర్పం కూడా ఉంది. ఆ మూడు పాములను ఆ నాగుపాము జీర్ణం చేసుకోలేకపోయింది. దీంతో ఆ పాములను నోటి నుంచి బయటకు విడిచేసింది. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెద్ద నాగుపాము తను మింగిన సర్పాలను నోటి ద్వారా బయటకు వదిలేయడం కనిపిస్తోంది. ముందుగా ఓ భారీ సర్పాన్ని బయటకు వదిలింది. అప్పటికే ఆ సర్పం ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత మరో రెండు చిన్న పాములను కూడా బయటకు విడిచేసింది. ఆ మూడు సర్పాలు ప్రాణాలతో లేవు. మూడు సర్పాలను ఒకేసారి మింగేసిన నాగుపాము వాటిని అరిగించుకోలేకపోయింది. కనీసం కదలలేకపోయింది. దీంతో రోడ్డు పక్కన వాటిని వదిలించుకుంది. ఆ పాము చుట్టూ చాలా మంది గుమిగూడి చూస్తున్నారు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ భయానక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


@Rainmaker1973 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.9 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ వీడియో చాలా భయానకంగా ఉంది``, ``ఆ పాములు దాని గొంతులో ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి``, ``వాటి రుచి నచ్చలేదేమో``, ``అంత పెద్ద పామును ఎలా మింగింది``, ``అత్యాశకు పోతే అలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. ఆ సింహం స్వాగ్‌కు ఫిదా కావాల్సిందే.. బానెట్ మీద నిల్చుని ఎలా ప్రయాణించిందో చూడండి..


Funny Answer Sheet: హిస్టరీ పరీక్షలో ఆ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్.. టీచర్ ఏం చేశారంటే..

Picture Puzzle: మీ బ్రెయిన్ స్పీడ్ ఎంత?.. ఈ పార్టీలో దొంగను 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: పాకిస్తాన్‌లో అమ్మాయిలు లేరా? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పేది వింటే షాక్ అవ్వాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 20 , 2024 | 10:19 AM