ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుబేరుల లైటర్లివి...

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:37 AM

కుబేరులు తమ చేతిలో ఉండే వస్తువు ఏదైనా ఖరీదైనదై ఉండాలని కోరుకుంటారు. కొందరు అపర కోటీశ్వరులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా అలాంటి వస్తువులు తయారు చేయించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు మిలియనీర్ల కోసం కొన్ని కంపెనీలు తయారుచేసిన లైటర్ల విశేషాలివి ...

కుబేరులు తమ చేతిలో ఉండే వస్తువు ఏదైనా ఖరీదైనదై ఉండాలని కోరుకుంటారు. కొందరు అపర కోటీశ్వరులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా అలాంటి వస్తువులు తయారు చేయించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు మిలియనీర్ల కోసం కొన్ని కంపెనీలు తయారుచేసిన లైటర్ల విశేషాలివి ...

- లిమిటెడ్‌ ఎడిషన్‌

ఫ్రాంక్‌ ముల్లర్‌ అండ్‌ ఎస్‌.టి డ్యుపాంట్‌ మాస్టర్‌ లైటర్‌ అనే ఈ లగ్జరీ లైటర్‌లో అనేక ప్రత్యేకతలున్నాయి. రెండు వైపులా వాచ్‌ డయల్‌ ఉంటుంది. వాచ్‌డయల్‌లో అంకెలు రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ సిరీస్‌. ఇప్పటిదాకా ఇలాంటివి 88 లైటర్లు మాత్రమే విడుదల చేశారు. మూడు డిజైన్లలో లభిస్తాయి. ధర విషయానికొస్తే రూ.47 లక్షల నుంచి 60 లక్షల మధ్య ఉంటుంది.


- గిన్నిస్‌ రాజ కిరీటం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లైటర్‌గా లూయిస్‌ - 8 ఫ్లూర్‌ డి పర్మే గుర్తింపు పొందింది. 2013లో దీన్ని విడుదల చేశారు. హాంకాంగ్‌కు చెందిన బిలియనీర్‌ స్టీవెన్‌ హంగ్‌ అభ్యర్థన మేరకు ఎస్‌.టి డ్యుపాంట్‌ సంస్థ స్పెషల్‌గా డిజైన్‌ చేసింది. లైటర్‌పై స్వచ్ఛమైన బంగారంతో ఫ్లూర్‌ డి పర్మే అని రాసి ఉంటుంది. 152 నీలం రాళ్లు, 400 గ్రాముల బంగారాన్ని ఈ లైటర్‌ తయారీలో ఉపయోగిం చారు. రాజ కిరీటంలా కనిపించడం దీని ప్రత్యేకత. ఖరీదైన లైటర్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. దీని ధర సుమారు రూ.4 కోట్లు.

- ఫ్రెంచ్‌ రాజసం

లగ్జరీ కారు కన్నా మోంట్గోల్పియర్‌ లైటర్‌ ధర ఎక్కువ. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లా దీన్ని డిజైన్‌ చేశారు. ఫ్రెంచ్‌ రాజసం ఉట్టిపడేలా నీలిరంగులో తయారుచేశారు. బంగారు ముక్కలను పొదిగారు. లిమిటెడ్‌ ఎడిషన్‌లో భాగంగా 8 లైటర్లు మాత్రమే తయారు చేశారు. దీని ధర రూ. 3 కోట్లు.

క్షలు.


- 462 వజ్రాలతో...

ఎస్‌.టి డ్యుపాంట్‌ లిగ్నే 2 షాంపైన్‌... ఖరీదైన లైటర్‌లలో ఇదొకటి. ఈ లైటర్‌ తయారీలో 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించారు. 462 వజ్రాలను లైటర్‌పై పొదిగారు. సాలిడ్‌ గోల్డ్‌, వైట్‌ గోల్డ్‌, డైమండ్‌, రోజ్‌ పింక్‌ గోల్డ్‌ వంటి నాలుగు రకాలలో లభిస్తుంది. దీని ధర సుమారు రూ.66 లక్షలు.

- వార్షికోత్సవ ప్రత్యేకం

ప్రముఖ ఫ్రెంచ్‌ సంస్థ ఎస్‌.టి డ్యుపాంట్‌ 2023లో 150 వార్షికోత్సవం సందర్భంగా కాసినో పాకెట్‌ కాంప్లికేషన్‌ లైటర్‌ను విడుదల చేసింది. ఈ లైటర్‌ పల్లాడియం, యెల్లో గోల్డ్‌, రోజ్‌ గోల్డ్‌ అని మూడు రకాల థీమ్‌లలో లభిస్తుంది. 2.5 అంగుళాల పొడవు, 1.5 అంగుళాల వెడల్పుతో ఆకట్టుకునేలా డిజైన్‌ చేశారు. దీని ధర సుమారు రూ. 54 లక్షలు.


- సేఫ్‌ లాక్‌తో...

2017లో ఎస్‌.టి డ్యుపాంట్‌ కాంప్లికేషన్‌ లైటర్‌ను విడుదల చేశారు. ఇది డిజైన్‌ పరంగానే కాకుండా పనితనంలోనూ నంబర్‌ వన్‌గా నిలిచింది. సేఫ్‌ లాక్‌ మెకానిజంను కలిగి ఉంటుంది. మూడు అంకెల కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా లైటర్‌ను ఉపయోగించుకోవచ్చు. లగ్జరీ లుక్‌ కోసం తొమ్మిది కెంపులను పొదిగారు. దీని ధర సుమారు రూ. 35 లక్షలు.

- బొచ్చుకుక్క కాదు...

ష్లంబర్గర్‌ గోల్డ్‌ పూడ్లే లైటర్‌ను 14 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. పూడ్లే(బొచ్చు కుక్క) ఆకారంలో ఉంటుంది. కళ్ల స్థానంలో కెంపులను పొదిగారు. తలను తెరిస్తే మంట వస్తుంది. దీని ధర సుమారు రూ.15 లక్షలు.

Updated Date - Sep 01 , 2024 | 11:37 AM

Advertising
Advertising