Viral Video: దయచేసి పిల్లల్ని ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి.. ఈ వీడియోలో పిల్లాడికి ఏం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే!
ABN, Publish Date - May 27 , 2024 | 02:45 PM
ప్రస్తుతం పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న చిన్న టౌన్లలో కూడా బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు ఎక్కువైపోయాయి. మెట్ల దారి ఉన్నా, ప్రతి బిల్డింగ్‌కూ లిఫ్ట్ కూడా ఉంటోంది. చాలా మంది పై అంతస్తులకు వెళ్లేందుకు లిఫ్ట్‌నే వాడుతుంటారు. అయితే చిన్న పిల్లలను ఒంటరిగా లిఫ్ట్ దగ్గరకు పంపించడం చాలా ప్రమాదకరం.
ప్రస్తుతం పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న చిన్న టౌన్లలో కూడా బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు ఎక్కువైపోయాయి. మెట్ల దారి ఉన్నా, ప్రతి బిల్డింగ్‌కూ లిఫ్ట్ (Lift) కూడా ఉంటోంది. చాలా మంది పై అంతస్తులకు వెళ్లేందుకు లిఫ్ట్‌నే వాడుతుంటారు. అయితే చిన్న పిల్లలను ఒంటరిగా లిఫ్ట్ దగ్గరకు పంపించడం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ అవకతప్పదు. లిఫ్ట్ డోర్‌లతో ఆడుకుంటున్న పిల్లాడు ప్రమాదం బారిన పడ్డాడు (Child getting stuck in a lift).
now_tw అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆరేళ్ల కుర్రాడు లిఫ్ట్ డోర్ దగ్గర నిల్చున్నాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ కాగానే, అందులోకి ఎక్కకుండా ఆటలు మొదలుపెట్టాడు. లిఫ్ట్ డోర్లు మూసుకుంటున్నప్పుడు చేతులు అడ్డు పెట్టాడు. దీంతో డోర్లు వెనక్కి వెళ్లిపోయాయి. మళ్లీ అవి మూసుకుంటున్నప్పుడు చేతులు అడ్డు పెట్టాడు. ఈసారి ఆ డోర్లు మూసుకుపోయాయి. దీంతో రెండు డోర్ల మధ్య పిల్లాడి చేయి ఇరుక్కుపోయింది. ఆ పిల్లాడు నొప్పితో విలవిలలాడాడు.
మరో చేత్తో బటన్ నొక్కి లిఫ్ట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. చైనా (China)లో జరిగిన ఈ ఘటనలో ఆ బాలుడి చేయి నుజ్జునుజ్జయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను కొన్ని కోట్ల మంది వీక్షించారు. లక్ష మందికి పైగా ఈ వీడియోను షేర్ చేసి ఇతరులకు జాగ్రత్తలు చెబుతున్నారు. పిల్లలను ఒంటరిగా లిఫ్ట్ దగ్గరకు వెళ్లనివ్వ వద్దని సూచనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో 280 నెంబర్ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి!
Viral Video: గొరిల్లాలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా? చిన్న పక్షితో స్నేహం కోసం గొరిల్లా ప్రయత్నం చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 27 , 2024 | 02:45 PM