ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వేటాడే ముందు పులి ఎంత సైలెంట్‌గా ఉంటుందో తెలుసా? ఈ వీడియోలో చిరుతల వేట చూస్తే..

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:15 PM

వేట విషయంలో పులి పాటించే టెక్నిక్‌లు మరొక జంతువుకు తెలియవు. పులి ఏదైనా జంతువును చూసిందంటే చిన్న శబ్దం కూడా రాకుండా దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ఆ జంతువును పరిశీలించి అప్పుడు దాడికి దిగుతుంది. ఆ దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.

Leopard Hunting

సింహం (Lion) అడవికి రారాజు అయినప్పటికీ.. వేటాడే విషయంలో పులిని (Tiger) మించిన జంతువు మరొకటి ఉండదు. వేట విషయంలో పులి పాటించే టెక్నిక్‌లు మరొక జంతువుకు తెలియవు. పులి ఏదైనా జంతువును చూసిందంటే చిన్న శబ్దం కూడా రాకుండా దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ఆ జంతువును పరిశీలించి అప్పుడు దాడికి దిగుతుంది. ఆ దాడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. పులి తరహాలోనే చిరుత (Leopards)లు కూడా వేట సాగిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చిరుతల వేటకు సంబంధించిన పలు దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ వీడియోల చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).


wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిరుత పులి ఓ అడవి పందిని (wild boar) వేటాడేందుకు ఎంతో సహనంతో వేచి చూస్తోంది. అడవి పంది తన గుహ నుంచి బయటకు వచ్చింది. ఆ గుహ పైన కాపు కాసిన చిరుత ఎంతో సహనంతో వేచి చూసింది. కొద్ది సేపటి తర్వాత వెనుక నుంచి ఆ అడవి పందిపై దూకింది. అలాగే మరికొన్ని చిరుతలు వేట సాగించే పద్ధతులను కూడా ఆ వీడియోలో చూపించారు. ఈ వీడియోను ఆఫ్రికాలోని సహారా ప్రాంతంలో చిత్రీకరించారు. అత్యంత వేగంగా పరిగెత్తే జంతువైన చిరుత నుంచి తప్పించుకోవడం వేరే ఏ జంతువుకైనా అసాధ్యమే.


ప్రస్తుత వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 70 వేల మందికి పైగా వీక్షించారు. మూడు వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సహారా ప్రాంతంలో చిరుతలు, అడవి పందులు ఎక్కువగా కనిపిస్తుంటాయి``, ``చిరుత నుంచి తప్పించుకోవడం అడవి పందికి అసాధ్యం``, ``ఇది నిజంగా అద్భుతమైన వీడియో``, ``వేట సమయంలో చిరుతలు కూడా పెద్ద పులిలాగానే చాలా సహనంగా ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌.. ఈ జపాన్ వ్యక్తి టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..


Viral: ఈ ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్యాసింజర్లకు కన్నడం ఎలా నేర్పుతున్నాడంటే..


Picture Puzzle: మీ ఐక్యూ లెవెల్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో చెప్పండి..


Viral: రాజస్థాన్‌లో నిల్చుని మధ్యప్రదేశ్‌లో టిక్కెట్ తీసుకోవాలి.. ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుని అమితాబ్ కూడా షాక్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 12:15 PM