ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఈ వీడియో చూస్తే భయంతో వణకాల్సిందే.. రెండు బిల్డింగ్‌ల మధ్య పిడుగు ఎలా పడిందంటే..

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:00 PM

వర్షం పడుతున్నప్పుడు మేఘాల ఘర్జన, ఉరుములు, మెరుపులు అందర్నీ భయకంపితులను చేస్తాయి. ప్రస్తుతం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో కూడా తుపాను కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఉరుములు, మెరుపులతో చెన్నై గగనతలం హోరెత్తిపోయింది.

Lightning during a storm in Chennai

ప్రకృతి దృశ్యాలు ఎంత రమణీయంగా ఉంటాయో, ఒక్కోసారి అంత కంటే ఎక్కువ భయంకరంగా కూడా ఉంటాయి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు మేఘాల ఘర్జన, ఉరుములు, మెరుపులు అందర్నీ భయకంపితులను చేస్తాయి. ప్రస్తుతం తమిళనాడులో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. రాజధాని చెన్నై (Chennai)లో కూడా తుఫాను కారణంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఉరుములు, మెరుపులతో చెన్నై గగనతలం హోరెత్తిపోయింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు మెరిసే దృశ్యాన్ని ప్రజలు తమ ఫోన్‌లలో బంధించారు. ఆ వీడియో చాలా మందిని భయపెడుతోంది. మరికొందరిని ఆశ్చర్యపరుస్తోంది (Viral Video).


common_man_IN అనే ట్విటర్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఉరుములు, మెరుపులతో కూడిన ఆకాశం అందమైన పెయింటింగ్‌లా ఉంది. మరోవైపు భయం కూడా కలిగిస్తోంది. వీడియోలో కనిపించే ఈ తుఫాను (Storm) దృశ్యాలను చూసిన తర్వాత ఎవరైనా భయపడక తప్పదు. రెండు భవనాల మధ్య పిడుగు (Lightning) పడుతున్న దృశ్యం చాలా భయానకంగా ఉంది. అలాగే ఆకాశంలో మెరుపులు చాలా మందిని కనువిందు చేస్తున్నాయి. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో మంది వీక్షించారు. లక్షల మంది ఈ వీడియోను చూసి లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా బాగా క్యాప్చర్ చేశారు``, ``ఇది నిజమైనదా? ఏఐ వీడియోనా``, ``ప్రకృతి ఎంత అందమైనదో, అంత భయంకరమైనది``, ``ఈ వీడియో చూస్తే ఒకేసారి భయం, ఆహ్లాదం కలుగుతున్నాయి``, ``లైవ్‌లో ఆ దృశ్యాలను చూసే వారు ఎంత భయపడి ఉంటారో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..



Viral Video: కిక్ ఎక్కాక.. కొండచిలువ అయినా డోంట్ కేర్.. మత్తులో ఉన్న వ్యక్తి పైకి ఎక్కిన కొండచిలువ ఏం చేసిందో చూడండి..

Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..

Viral Video: వావ్.. ఆ ఆంటీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గిన్నెలు తోమేందుకు సూపర్ టెక్నిక్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 12:00 PM