ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: సడెన్‌గా బాయ్‌ఫ్రెండ్ అదృశ్యం! మహిళకు షాక్! హ్యాండిచ్చాడనుకుంటే..

ABN, Publish Date - Jun 08 , 2024 | 07:29 PM

ఒకసారి కలిసిన మనసులు ఎన్నటికీ విడిపోవని రుజువు చేసే ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అమెరికాకు చెందిన ఓ జంట అనూహ్య పరిస్థితుల్లో విడిపోయి మళ్లీ ఎలా కలిసిందీ తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమకున్న శక్తి ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఒకసారి కలిసిన మనసులు ఎన్నటికీ విడిపోవని రుజువు చేసే ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది. అమెరికాకు చెందిన ఓ జంట అనూహ్య పరిస్థితుల్లో విడిపోయి మళ్లీ ఎలా కలిసిందీ తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమకున్న శక్తి ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు.

Viral: గుడ్లను తింటున్న పాము! ఏం చేయలేక నిస్సహాయంగా బాతులు! ఇంతలో సడెన్‌గా..

కోడీ బ్రయంట్, హేలీ వోలోషెన్ ఇద్దరూ లాస్ ఏంజెలెస్‌లోనే ఉంటారు. కానీ, 2022లో ఇద్దరు సెలవులపై హవాయిలో గడుపుతున్న సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. కోడీది కూడా లాస్ ఏంజిలిస్ అని అతడి టిక్‌టాక్ వీడియో ద్వారా తెలుసుకున్న హేలీ ఆశ్చర్యపోయింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మొదలైన స్నేహం, ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరికొకరు నచ్చారనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా కోడీ అదృశ్యమైపోయాడు. అతడికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో, తనని అతడు సైలెంట్ గా వదిలించేసుకున్నాడని హేలీ భావించింది. కొన్ని రోజులు బాధపడినా మెల్లగా కోడీని మర్చిపోసాగింది (Los Angeles woman thought her boyfriend ghosted her but he was actually in coma).


ఈ క్రమంలో కోడీకి సంబంధించి మరో సమాచారం తెలిసి హేలీ దిమ్మెరపోయింది. అతడికి స్పెయిన్ లో ఉండగా యాక్సిడెంట్ అయ్యిందని, మెదడుకు పెద్ద దెబ్బ తగలడంతో పక్షవాతం కూడా వచ్చిందని తెలిసి అతడి చూసేందుకు వెళ్లింది. కానీ, యాక్సిడెంట్ కారణంగా కోడీ తన గతాన్ని చాలా వరకూ మర్చిపోయాడు. హేలీతో ప్రేమ వ్యవహారం అతడికి అసలు గుర్తేలేదు. కోడీ ఇలంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిశాక హేలీ గుండె విలవిల్లాడింది. చివరకు అతడికి అండగా ఉండేందుకు ఆమె నిశ్చయించుకుంది.

హేలీ సంరక్షణలో కోడీ క్రమంగా కోలుకున్నాడు. ఆమె సపర్యలతో అతడిలో కొత్త ధైర్యం వచ్చింది. తన అనారోగ్యాన్ని జయించగలనన్న నమ్మకంతో అతడు రకరకాల ఎక్సర్‌సైజులు, మెడిటేషన్, ఇతర చికిత్సలు తీసుకుని చాలా వరకూ కోలుకున్నాడు. పర్వతారోహణలో కూడా పాల్గొని స్నేహితులను, బంధువులను ఆశ్చర్యపరిచాడు. హేలీ ఎవరో తనకు గుర్తుకు రాకపోయినా ఆమెలో మళ్లీ ప్రేమలో పడ్డాడు. అలా మళ్లీ వారి మధ్య బంధం మొదలైంది. హేలీ తనకు అండగా నిలవడమే కాకుండా తన మనసు మళ్లీ గెలుచుకుందని కోడీ సంబరపడిపోతూ చెప్పాడు.

Read Viral and Telugu News

Read more!

Updated Date - Jun 08 , 2024 | 07:30 PM

Advertising
Advertising