Viral: జిమ్‌లో చోరీ చేస్తూ పట్టుబడ్డ దొంగ! ఓనర్ ఎలాంటి శిక్ష వేశాడో తెలిస్తే..
ABN, Publish Date - Jun 07 , 2024 | 08:49 PM
జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ టీనేజర్ అడ్డంగా బుక్కైపోయాడు. తనకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన అతడికి జిమ్ ఓనర్ ఊహించని శిక్ష వేశాక పోలీసులకు అప్పగించాడు. మధ్యప్రదేశ్ లోని దాటియా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ టీనేజర్ అడ్డంగా బుక్కైపోయాడు. తనకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన అతడికి జిమ్ ఓనర్ ఊహించని శిక్ష వేశాక పోలీసులకు అప్పగించాడు. మధ్యప్రదేశ్ లోని దాటియా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: నిమిషానికి 300 పదాల స్పీడుతో టైపింగ్! జడివాన పడ్డట్టు శబ్దం!
ఇటీవల ఓ రోజు రాత్రి ఆ టీనేజ్ దొంగ షట్టర్ ను పైకెత్తి జిమ్ లోపలికి వెళ్లాడు. ఏ వస్తువు దొంగిలించాలా అనుకుంటూ అక్కడ కలియతిరిగాడు. అదే సమయంలో తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న జిమ్ ఓనర్‌కు అకస్మాత్తుగా మెళకువ వచ్చింది. యదాలాపంగా తన ఫోన్ తీసి జిమ్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా దొంగ తచ్చాడుతూ కనిపించాడు. దీంతో, హుటాహుటిన జిమ్ కు వెళ్లిన ఓనర్ కుర్రాడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఓనర్ సడెన్ గా అక్కడ ప్రత్యక్షం కాగానే టీనేజర్ దిమ్మెరపోయాడు. ఈ క్రమంలో ఓనర్ ఆ కుర్రాడిని జిమ్‌లో ట్రెడ్ మిల్‌పై పరిగెత్తాలంటూ శిక్ష విధించాడు. చివరకు పోలీసులకు అప్పగించాడు (Madhya Pradesh gym owner makes thief run on treadmill after catching him).
కాగా, ఉత్తరప్రదేశ్ గత వారం ఓ దొంగ మద్యం మత్తులో చోరీకి వచ్చి గాఢంగా నిద్రపోయాడు. మరుసటి రోజు అతడికి మెళకువ వచ్చేసరికి చుట్టూరా పోలీసులు ఉండటం చూసి దిమ్మెరపోయాడు. అసలే మద్యం మత్తులో ఉన్న అతడు ఇంట్లో ఏసీ కూడా ఆన్ ఉండటంతో హ్యాపీగా నిద్రపోయాడని పోలీసులు తెలిపారు.
Updated Date - Jun 07 , 2024 | 08:51 PM