మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే.. గాల్లో ఎగురుతూ ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి!

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:30 PM

మలేసియాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాల్లో ఎగురుతున్న రెండు హెలీకాఫ్టర్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. నేవీ విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలేసియాలో వచ్చే శుక్రవారం రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవ జరగబోతోంది.

Viral Video: వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే.. గాల్లో ఎగురుతూ ఢీకొన్న రెండు హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి!

మలేసియాలో (Malaysia) దారుణ ఘటన చోటు చేసుకుంది. గాల్లో ఎగురుతున్న రెండు హెలీకాఫ్టర్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. నేవీ విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలేసియాలో వచ్చే శుక్రవారం రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవ జరగబోతోంది (Malaysian navy). ఆ రోజు ప్రదర్శన ఇచ్చేందుకు మలేసియాలోని పెరక్ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు (Helicopters collide).


ఈ రిహార్సల్స్ కోసం పడంగ్ సితియావాన్ కేంద్రం నుంచి చాలా హెలికాఫ్టర్లు గాల్లోకి ఎగిరి రిహార్సల్స్ ప్రారంభించాయి. వాటిల్లో రెండు హెలికాఫ్టర్లు ప్రమాదవశాత్తూ ఒకదానినొకటి ఢీకొన్నాయి. వీటిల్లో ఒకటి పక్కనే ఉన్న స్టేడియంలో కూలిపోయింది. మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు.


ఈ రెండు హెలికాఫ్టర్లు గాల్లో ఢీకొని కూలిపోతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రమాద కారణాలపై విచారణకు కమిటీని ఏర్పాటుచేసినట్టు మలేసియా నేవీ తెలిపింది. మలేసియా సైన్యానికి చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం గత రెండు నెలల్లో ఇది రెండోది. మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ గత నెలలో రెస్క్యూ డ్రిల్‌లు నిర్వహిస్తుండగా ఓ హెలికాఫ్టర్ కూలిపోయింది.

ఇవి కూడా చదవండి..

Puzzle: తెలివైన వాళ్లు కూడా ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టలేకపోయారు.. మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!


Viral Video: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్లు ఆగ్రహం..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2024 | 12:30 PM

Advertising
Advertising