ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: తనకో గర్ల్‌ఫ్రెండ్ వెతికిపెట్టమన్న యువకుడికి పోలీసుల రిప్లై చూస్తే..

ABN, Publish Date - May 31 , 2024 | 05:22 PM

తనకో గర్ల్ ఫ్రెండ్ వెతికిపెట్టమంటూ యువకుడు వేసిన తుంటరి ప్రశ్నకు ఢిల్లీ పోలీసులు అదే రేంజ్‌లో సమాధానం ఇచ్చారు. జనాలకు ఆకట్టుకుంటున్న ఈ పోస్టు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

Delhpolice witty reply to youth asking for their help in finding a girlfriend for him

ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలంలో ప్రజలతో నిత్యం టచ్ లో ఉండాలంటే ఒకే ఒక్క మార్గం సోషల్ మీడియా. అందుకే ప్రభుత్వ శాఖలు కూడా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాయి. ప్రజలు అడిగే ప్రశ్నలకు టక్కున సమాధానం ఇస్తుంటాయి. అలా కుదరని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలకు రమ్మని సలహా ఇస్తుంటాయి. ఇక అన్ని రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాను విరివిరిగా వినియోగిస్తున్నారు. యాక్సిడెంట్ల వీడియోలో షేర్ చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. తప్పొప్పులు, నిబంధనల గురించి సవివరంగా చెబుతున్నారు. అదే సమయంలో చక్కని హాస్యచతురత కలిగిన పోస్టులు పెడుతు అప్పుడప్పుడూ జనాలను కడుపుబ్బా నివ్విస్తున్నారు. ఢిల్లీ పోలీసులు తాజాగా ఇలాంటి పోస్టు పెట్టారు. ఇది తెగ వైరల్ (Viral) అవుతూ జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది.

Viral: మ్యాజిక్ ట్రిక్ చూసి కోతి ఫిదా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇటీవల ఓ యువకుడు ఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ ఓ సరదా పోస్టు పెట్టాడు. ‘‘నా కోసం ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను ఎప్పుడు వెతికిపెడతారు. నేను సిగ్నల్ (సింగిల్) గా ఉన్నాను’’ అని పోస్టు పెట్టాడు. ఇంగ్లిష్‌లో పోస్టు పెట్టిన అతడు సింగిల్ అనే సిగ్నల్ అని పొరపాటుగా రాసుకొచ్చాడు. ఇది గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో హాస్యం పండించారు. ‘‘సర్.. మీ గర్ల్‌ఫ్రెండ్ ఎప్పుడైనా కనిపించకపోతేనే మేము సాయం చేయగలం. అయితే మీకో చిన్న సలహా. మీరు ప్రస్తుతం సిగ్నల్ గా ఉన్నారు కాబట్టి, గ్రీన్ సిగ్నల్ లో ఉండండి..’’ అని రాసుకొచ్చాడు. ఎప్పుడోకప్పుడు గర్ల్‌ఫ్రెండ్ దొరక్కపోదని పరోక్షంగా చెప్పుకొచ్చారు (Man asks Delhi Police to help him find a girlfriend Their witty reply is hilarious).

జనాలకు ఢిల్లీ పోలీసుల రిప్లై అద్భుతంగా నచ్చడంతో ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లైకులు, వ్యూస్ కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఢిల్లీ పోలీసులు ఫన్నీ పోస్టు చూసి అనేక మంది పడీపడీ నవ్వారు. దిమ్మతిరిగే సమాధానం అంటూ ప్రశంసించారు.

Read Viral and Telugu News

Updated Date - May 31 , 2024 | 05:26 PM

Advertising
Advertising