Viral Video: ఇదెక్కడి చిత్రం.. రూ.90 వేలతో బైక్ కొన్నాడు.. రూ.60 వేలతో ఊరేగింపు చేశాడు..
ABN, Publish Date - Oct 15 , 2024 | 09:57 AM
కొందరు వ్యక్తులు కావాలని చేస్తారో, అజ్ఞానంతో చేస్తారో తెలియదు గానీ, చుట్టు పక్కల వారికి అర్థం కాని రీతిలో ప్రవర్తిస్తుంటారు. వారి ప్రవర్తన చూసి పక్కన ఉన్న వారు అయోమయానికి గురవుతుంటారు. మధ్యప్రదేశ్‌లోని శివ్పురీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రవర్తన చుట్టు పక్కల వారికే కాదు.. విషయం తెలిసిన అందరికీ షాకిస్తోంది.
కొందరు వ్యక్తులు భలే విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కావాలని చేస్తారో, అజ్ఞానంతో చేస్తారో తెలియదు గానీ, చుట్టు పక్కల వారికి అర్థం కాని రీతిలో వ్యవహరిస్తారు. వారి ప్రవర్తన చూసి పక్కన ఉన్న వారు అయోమయానికి గురవుతుంటారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh)లోని శివ్పురీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రవర్తన చుట్టు పక్కల వారికే కాదు.. విషయం తెలిసిన అందరికీ షాకిస్తోంది. నాగ్‌పూర్‌కు చెందిన మురారీ లాల్ కుష్వాహా అనే వ్యక్తి శివపురిలో టీ దుకాణం (Tea Seller) నిర్వహిస్తున్నాడు. అతడు రూ.90 వేలు విలువైన కొత్త బండిని ఇంటికి తెచ్చేందుకు అదనంగా రూ.60 వేలను ఖర్చు చేశాడు (Viral Video).
కుష్వాహా ఆదివారం తన కుమార్తెతో కలిసి మోపెడ్ (TVS Moped) బైక్‌ను కొనుగోలు చేసేందుకు షోరూమ్‌కు వెళ్లాడు. అతడు తనతో పాటు షోరూమ్‌కు క్రేన్, బగ్గీ, డీజే డ్యాన్సర్లను కూడా తీసుకుని వెళ్లాడు. రూ.90 వేల విలువైన మోపెడ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ రూ.90 వేలకు గానూ రూ.20 వేలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించాడు. ఆ బైక్‌ను ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లేందుకు మాత్రం ఏకంగా రూ.60 వేలు ఖర్చు పెట్టాడు. కొత్త బండిని క్రేన్‌ను తగిలించి డీజే డ్యాన్స్‌లతో తన ఇంటికి తీసుకెళ్లాడు. విచారకర విషయం ఏంటంటే.. అనుమతి లేకుండా ఊరేగింపు, డీజే నిర్వహించనందుకు పోలీసులు క్రేన్‌ను, డీజేను, బండిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన కుమార్తె సంతోషం కోసమే ఊరేగింపు నిర్వహించానని కుష్వాహా చెబుతున్నాడు. అయితే కుష్వాహా ఇలా ధూమ్‌ధామ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తన కూతురి కోసం అతడు రూ.12,500 విలువైన మొబైల్ ఫోన్‌ను కొన్నాడు. మొబైల్ స్టోర్ నుంచి ఆ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా డీజే, ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించాడు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రస్తుత వీడియోను 33 వేల మందికి పైగా వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 15 , 2024 | 09:58 AM