ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అర్ధరాత్రి పోలీసులకు ఫోన్.. చోరీ జరిగిందని వచ్చిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే షాక్..

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:33 PM

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలోని పోలీసులకు గత అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో చోరీ జరిగిందని, అర్జెంటుగా వచ్చి దొంగలను పట్టుకోవాలని ఫోన్ చేసిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తి చెప్పిన జవాబు విని పోలీసులు నివ్వెరపోయారు.

man calls police over 250-gram potato theft

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని హర్దోయి జిల్లాలోని పోలీసులకు (Police) గత అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంట్లో చోరీ జరిగిందని, అర్జెంటుగా వచ్చి దొంగలను పట్టుకోవాలని ఫోన్ చేసిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ అయిన వస్తువుల గురించి ప్రశ్నించారు. ఆ వ్యక్తి చెప్పిన జవాబు విని పోలీసులు నివ్వెరపోయారు. ఎందుకంటే కేవలం పావు కేజీ బంగాళాదుంపలు (Potatoes) పోయాయని అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ వింత కేసు విషయం సోషల్ మీడియాలో రావడంతో అది వైరల్ గా మారింది. విచారణలో ఆ వ్యక్తి చెబుతున్న జవాబులు వైరల్ అవుతున్నాయి (Viral Video).


హర్దోయి‌కి చెందిన విజయ్ వర్మ అనే వ్యక్తి యూపీ-112 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి, తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విజయ్ వర్మ ఇంట్లో పావుకేజీ బంగాళాదుంపలు పోయాయని తెలుసుకుని అవాక్కయ్యారు. బంగాళాదుంపలను వంట కోసం సిద్ధం చేసి, బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చానని, వంట చేద్దామని చేద్దామాని చూస్తే బంగాళాదుంపలు కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. తన బంగాళాదుంపలను దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మద్యం మత్తులో విజయ్ వర్మ ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.


విజయ్ వర్మ ఫిర్యాదును పోలీసులు రికార్డు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ``మీరు తాగి ఉన్నారా`` అని పోలీసులు అడిగిన ప్రశ్నకు విజయ్ ``అవును`` అని సమాధానం ఇచ్చాడు. ``అవును, నేను రోజంతా కష్టపడతాను. సాయంత్రం పానీయం తీసుకుంటాను. అయితే ఇది ఆల్కహాల్ గురించి కాదు. ఇది పోయిన బంగాళాదుంపల గురించి`` అని సమాధానమిచ్చాడు. ఈ ఘటనపై కచ్చితంగా దర్యాఫ్తు చేయాలని పట్టుబట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలకు నవ్వు తెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఎంత పెద్ద ప్రమాదం.. స్టంట్ చేయబోతే ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..


IQ Test: ఇక్కడున్న వారిలో ఫేక్ డాక్టర్ ఎవరు? 5 సెకెన్లలో కనిపెడితే మీ బ్రెయిన్ పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు..


Viral video: దీపావళి క్లీనింగ్ సమయంలో ఈ విషయం మర్చిపోకూడదట.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..


Viral Video: వామ్మో.. వాహనాలు గాల్లోకి ఎలా ఎగురుతున్నాయో చూడండి.. కారణం ఏంటో తెలిస్తే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 02 , 2024 | 03:33 PM