ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వేసవి ఎండకు చెక్ పెట్టాల్సింది ఇలాగే మరి.. ఓ వ్యక్తి వినూత్న ఆలోచనపై నెటిజన్ల కామెంట్లు!

ABN, Publish Date - Jun 24 , 2024 | 01:43 PM

ఈ ఏడాది వేసవి చాలా మందికి పీడకలలను మిగిల్చింది. సాధారణం కంటే ఎక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడించాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఏసీలు, కూలర్‌లతో సేద తీరినప్పటికీ బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Mango tree on scooty

ఈ ఏడాది వేసవి (Summer) చాలా మందికి పీడకలలను మిగిల్చింది. సాధారణం కంటే ఎక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడించాయి (Heat Wave). ఇంట్లో ఉన్నప్పుడు ఏసీలు, కూలర్‌లతో సేద తీరినప్పటికీ బయటకు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ఆ సమస్యలను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా ఓ వ్యక్తి వేసవి ఎండకు చెక్ పెట్టేందుకు ఎంచుకున్న పద్ధతి చాలా మందిని ఆలోచింపచేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


sethumadhavan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను కేరళలో (Kerala) చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి స్కూటీ (Scooty) మీద ఎండలో వెళుతున్నాడు. అయితే అతడి వెనుక ఓ మామిడి మొక్క (Mango tree) ఉంది. స్కూటీ వెనుక సీటుపై కుండీలో ఉన్న మామిడి మొక్కను కట్టేశారు. అది ఆ వ్యక్తికి చల్లటి నీడను ఇస్తోంది. విశేషమేమిటంటే.. ఆ మొక్కకు మామిడికాయలు కూడా ఉన్నాయి. రోడ్డుపై ఈ దృశ్యాన్ని చూసిన వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియా జనాలు కూడా ఈ వీడియో చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు (Mango tree on scooty).


ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటివరకు అనేక మిలియన్ల మంది వీక్షించారు. 1.1 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నీడ కోసం నిజంగా చేయాల్సిన పని ఇదే``, ``అతను తనతోపాటు సంతోషాన్ని తీసుకెళ్తున్నాడు``, ``మంచి ఆలోచన``, ``వీలైనన్ని మొక్కలను నాటితే ఈ అవసరమే ఉండదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ ఫొటోలో తప్పేంటో 8 సెకెన్లలో కనిపెడితే మీ బ్రెయిన్ పవర్ ఫుల్ అని నమ్మొచ్చు..!


Viral Video: ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడ్డాం.. పుచ్చకాయ నుంచి గింజలను ఎంత సులభంగా తీసేసిందో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 24 , 2024 | 01:43 PM

Advertising
Advertising