ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: అనకొండకు ఆహారం అవ్వాలనుకుని.. చివరకు.. షాకింగ్ ఘటన

ABN, Publish Date - May 31 , 2024 | 08:52 PM

అనకొండ శక్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ వ్యక్తి డేంజరస్ స్టంట్‌కు పూనుకున్నాడు. చావు నోట్లో తలపెట్టి చివరి నిమిషంలో బయటపడ్డాడు. నాటి అనుభవాలను అతడు మరోసారి మీడియాతో పంచుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: అనకొండ.. భూమ్మీదున్న భారీ పాముల్లో ఇదీ ఒకటి. దీని నోటికి చిక్కితే ఇక అంతే.. ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి అన్నకొండ నోట్లో తలపెట్టాడో వ్యక్తి. కావాలనే చావును ఆహ్వానించాడు. కానీ చివరి నమిషంలో వెనక్కు మళ్లీ ప్రాణాలు కాపాడుకున్నాడు. నేటికి సరిగ్గా10 ఏళ్ల క్రితం జరిగిందీ ఘటన. చావు నోట్లో తలపెట్టిన ఈ వ్యక్తి పేరు పాల్ రోసలీ. జంతు, ప్రకృతి సంరక్షణ కోసం పాటుపడే పాల్.. అనకొండపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దుస్సాహసానికి పూనుకున్నాడు. ఇన్నాళ్ల తరువాత మీడియా అతడిని మళ్లీ పలకరించింది. ఈ క్రమంలో తన అనుభవాలను అతడు మరోసారి పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు (Viral).

Viral: తనకో గర్ల్‌ఫ్రెండ్ వెతికిపెట్టమన్న యువకుడికి పోలీసుల రిప్లై చూస్తే..


‘‘నాటి ఘటనలో నాకు బాగా గుర్తుందీ అనకొండనే. అది పెద్దగా నోరు తెరవడం చూసి నాకు గుండె ఆగినంత పనైంది. దాని నోట్లోకి వెళ్లగానే అంతా చీకటి అయిపోయింది. నేను మాత్రం అలా కదలకుండానే ఉండిపోయాను. మెల్లగా అది నన్ను గట్టిగా చుట్టుకుంది. పక్కటెముకలు విరిగిపోతున్నట్టు అనిపించింది. నేను ఊపిరి తీసుకుని వదిలి ప్రతిసారీ అది పట్టుబిగించింది. దీంతో, శ్వాస తీసుకోవడం రానురాను కష్టంగా మారింది. కనీసం సాయం కూడా అడగలేని పరిస్థితి వచ్చింది. అదో భయానక అనుభవం’’ అని చెప్పుకొచ్చాడు. పరిస్థితి చేయి దాటుతుండగా అతడు ఇతరుల సాయంతో పాము నుంచి విడిపించుకోగలిగాడు (Man Describes How It Was Like To Be Eaten Alive By Anaconda).


ఈ పాములు ఎంత శక్తిమంతమైనవో ప్రజలకు తెలియజెప్పడమే తన ప్రధాన ఉద్దేశమని పాల్ అన్నాడు. నిపుణులు ప్రకారం, అనకొండ ప్రపంచంలోని అత్యంత బారీ పాము. పొడవు, బరువులో దీనికి మించినది మరొకటి లేదు. తొమ్మిది మీటర్ల పొడవు, 227 కేజీల బరువుకు చేరుకుంటుంది. దక్షిణఅమెరికా ఖండంలోని అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Read Viral and Telugu News

Updated Date - May 31 , 2024 | 08:56 PM

Advertising
Advertising