ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భార్య ట్యాబ్ ఓపెన్ చేసిన భర్తకు దిమ్మదిరిగే షాక్.. అందులో ఫొటోలు చూసి భర్త తీసుకున్న నిర్ణయం ఏంటంటే..!

ABN, Publish Date - Jul 17 , 2024 | 02:35 PM

ఆ వ్యక్తికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఓ పాప కూడా ఉంది.. ఇటీవల తన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు భార్య ట్యాబ్ ఓపెన్ చేశాడు.. అందులో తన భార్యకు సంబంధించిన మరో గూగుల్ ఖాతాను ఓపెన్ చేశాడు.. అందులో ``ఎక్స్`` పేరుతో ఉన్న ఓ సీక్రెట్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.

Husband

ఆ వ్యక్తికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం (Marriage) జరిగింది.. ఓ పాప కూడా ఉంది.. ఇటీవల తన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు భార్య (Wife) ట్యాబ్ ఓపెన్ చేశాడు.. అందులో తన భార్యకు సంబంధించిన మరో గూగుల్ ఖాతాను ఓపెన్ చేశాడు.. అందులో ``ఎక్స్`` పేరుతో ఉన్న ఓ సీక్రెట్ ఫోల్డర్‌ను (Secret Photos) చూశాడు.. తన భార్య వివాహేతర సంబంధం గురించి లేదా బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోలు ఉంటాయనుకున్నాడు.. తీరా ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు. ఎందుకంటే ఆ ఫోల్డర్‌లో అతడు తన మాజీ ప్రేయసితో ఉన్న ఫొటోలున్నాయి (Viral News).


తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని ఆ 36 ఏళ్ల వ్యక్తి రెడ్డిట్ ద్వారా పంచుకున్నాడు. ``నేను 9 ఏళ్ల క్రితం నా ప్రేయసితో విడిపోయాను. అనంతరం నా భార్యను కలిశాను. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నా. నా మాజీ ప్రేయసి గురించి నా భార్యకు తెలుసు. 9 ఏళ్లుగా మేం కలిసి జీవిస్తున్నాం. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే.. నా మాజీ ప్రేయసిని నా భార్య వెంబడిస్తున్నట్టు అర్థమైంది. నా మాజీ ప్రేయసి హైస్కూల్‌లో చదువుతున్నప్పటి ఫొటోలను కూడా నా భార్య సేకరించింది.


నా భార్య ఇదంతా ఎందుకు చేస్తుందో కొంతకాలం తర్వాత అర్థమైంది. నా మాజీ ప్రియురాలి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్‌ను నా భార్య కాపీ చేస్తోంది. ఆమెలా మారేందుకు ప్రయత్నిస్తోంది. నేను ఇంకా మాజీ ప్రేయసినే ప్రేమిస్తున్నట్టు అనుమానిస్తోంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను నా కూతురుని తీసుకుని పారిపోవాలనుకుంటున్నా`` అంటూ రెడ్డిట్‌లో షేర్ చేశాడు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: కారులో వెళుతూ ఆ పనులేంటి మేడమ్? బరితెగించిన జంటకు పోలీసులు ఇచ్చిన సూపర్ ట్విస్ట్ ఏంటంటే..


Viral Video: కామెడీ కాకపోతే మరేంటి..? కుట్టు మెషిన్‌ను తిప్పడం కోసం ఇంత తతంగం అవసరమా?


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2024 | 02:35 PM

Advertising
Advertising
<