ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పెళ్లికి ముందు కాస్ట్లీ గిఫ్ట్‌గా ఎంగేజ్‌మెంట్ రింగ్.. పెళ్లి తర్వాత అసలు విషయం తెలుసుకుని భార్య షాక్!

ABN, Publish Date - May 10 , 2024 | 12:13 PM

ఓ మహిళకు ఎంగేజ్‌మెంట్ రింగ్ (Engagement Ring ) అనేది చాలా ప్రత్యేకం. కాబోయే భర్త తనకు ఇచ్చిన మొట్ట మొదటి గిఫ్ట్‌గా ఆమె భావించి దానిని భద్రంగా దాచుకుంటుంది. గిఫ్ట్ అనేది ఎప్పుడూ ఒక వ్యక్తి తన డబ్బులతో కొని ప్రియుడికో, ప్రియురాలికో ఇస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు.

Engagement Ring

ఓ మహిళకు ఎంగేజ్‌మెంట్ రింగ్ (Engagement Ring ) అనేది చాలా ప్రత్యేకం. కాబోయే భర్త తనకు ఇచ్చిన మొట్ట మొదటి గిఫ్ట్‌గా ఆమె భావించి దానిని భద్రంగా దాచుకుంటుంది. గిఫ్ట్ అనేది ఎప్పుడూ ఒక వ్యక్తి తన డబ్బులతో కొని ప్రియుడికో, ప్రియురాలికో ఇస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వెరైటీగా ఆలోచించాడు. తను ఇచ్చే గిఫ్ట్‌లో కూడా భార్యకు (Wife) భాగస్వామ్యం ఉండాలని అనుకున్నాడు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలుసుకున్న మహిళ షాకైంది. తన భర్త (Husband) నిర్వాకం గురించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది (Viral News).


రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ప్రకారం.. ఆ 28 ఏళ్ల మహిళకు ఇటీవలె వివాహం జరిగింది. పెళ్లికి ముందు నిశ్ఛితార్థం రోజున ఆమెకు కాబోయే భర్త రెండు క్యారెట్ల ల్యాబ్ డైమండ్ రింగ్‌ బహుమతిగా ఇచ్చాడు. దాని విలువ దాదాపు రూ.6 లక్షలు. దానిని వాయిదా పద్ధతిలో కొనుగోలు చేశాడు. కొన్నప్పుడు అతడు కొంత చెల్లించాడు. వివాహం అనంతరం కట్టాల్సిన వాయిదాల్లో భార్యను కూడా భాగస్వామిని చేశాడు. తమ జాయింట్ అకౌంట్ నుంచి డబ్బులు కడుతున్నాడు. దీంతో ఆ మహిళ షాకై భర్తతో గొడవకు దిగింది. భర్త చెప్పిన మాటలు విని నివ్వెరపోయింది.


నిశ్ఛితార్థం ఉంగరం కూడా పెళ్లి ఖర్చులో భాగమని, ఆ ఖర్చును ఇద్దరూ సమానంగా పంచుకోవాలని, ఆ ధరలో సగ భాగాన్ని పంచుకోవాలని చెప్పడంతో ఆ మహిళ షాకైంది. ఆ మహిళ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ``ఆ విషయం ముందుగా చెబితే ఆ మహిళ తన నిర్ణయం చెప్పేది``, ``గిఫ్ట్ తీసుకునే వారిని కూడా సగం ధర చెల్లించమనడం వింతగా ఉంది``, ``ఈ ఐడియా ఏదో బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: చాలా సులభమైన పిక్చర్ పజిల్.. ఈ ఫొటోలో హెడ్‌ఫోన్స్ ఎక్కడున్నాయో 5 సెకెన్లలో కనిపెట్టండి!


Viral: బీర్‌లపై ఆసక్తి అతడిని లక్షాధికారిని చేసింది.. బ్రిటన్‌కు చెందిన ఆ వ్యక్తి కథేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 10 , 2024 | 12:13 PM

Advertising
Advertising