ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఉద్యోగి చేసిన పనికి అవాక్కైన బాస్.. జాబ్‌కు రిజైన్ చేసి చివరి రోజు ఆఫీస్ ఎదుటే డ్యాన్స్‌లు.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Apr 27 , 2024 | 03:07 PM

మన అభిరుచికి తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ముఖ్యంగా కొందరు వ్యక్తుల పర్యవేక్షణలో పని చేయడం మరింత కష్టం. కానీ, చాలా మంది జీతం కోసం, కుటుంబ పోషణ కోసం వేరే దారిలేక కష్టమైనా పని చేస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం అలాంటి విషపూరిత వాతావరణంలో పని చేయలేక ఉద్యోగం వదిలేస్తుంటారు.

Employee dance

మన అభిరుచికి తగిన ఉద్యోగం (Job) దొరకడం చాలా కష్టం. ముఖ్యంగా కొందరు వ్యక్తుల పర్యవేక్షణలో పని చేయడం మరింత కష్టం. కానీ, చాలా మంది జీతం కోసం, కుటుంబ పోషణ కోసం వేరే దారిలేక కష్టమైనా పని చేస్తూనే ఉంటారు. మరికొందరు మాత్రం అలాంటి విషపూరిత వాతావరణంలో పని చేయలేక ఉద్యోగం వదిలేస్తుంటారు. పుణెకు (Pune) చెందిన ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాస్ (Boss) నుంచి వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. చివరి రోజు అతడు చేసిన పని బాస్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది (Viral Video).


పుణెకు చెందిన అనీష్ భగత్ అనే వ్యక్తి ఓ కంపెనీలో మూడేళ్లుగా సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఈ మూడేళ్లలో అతడికి ఒక్కసారి కూడా జీతం పెరగలేదు. అలాగే బాస్ నుంచి మాత్రం తరచుగా తిట్లు, వేధింపులు ఎదురవుతున్నాయి. ఆ బాధ భరించలేక అతడు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆఫీస్ నుంచి వెళ్లిపోయే చివరి రోజున ఓ వెరైటీ పార్టీ ప్లాన్ చేశాడు. తన స్నేహితులను డ్రమ్స్‌తో సహా ఆఫీస్‌కు రప్పించి గేట్ బయట డ్యాన్స్‌లు వేశాడు.


ఆ డ్యాన్స్‌ను చూసిన బాస్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ డ్రమ్స్ వాయిస్తున్న వారిని తోసేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన అనీష్.. ``మీలో చాలా మంది ఈ వీడియోతో కనెక్ట్ అవుతారని భావిస్తున్నా. విషపూరిత వాతావరణంలో పని చేయడం చాలా కష్టం. ప్రస్తుతం చాలా చోట్ల అలాగే ఉంది. కనీస గౌరవం, మర్యాద ఉండడం లేదు. నా కథ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా`` అంటూ అనికేత్ పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 65 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Miss Universe: అందాల పోటీల్లో సరికొత్త సంచలనం.. 60 ఏళ్ల మహిళకు అందాల కిరీటం..!


Exam: ఆన్సర్ షీట్‌లో జై శ్రీరామ్ నినాదాలు, క్రికెటర్ల పేర్లు.. పేపర్ దిద్దిన టీచర్ ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2024 | 03:07 PM

Advertising
Advertising