Viral Video: తెలివి అంటే ఇదీ.. ఈ ఇటుక కూలర్ ముందు ఏసీ కూడా బలదూర్.. ఎలా సెట్ చేశాడో చూడండి..
ABN, Publish Date - Jun 11 , 2024 | 12:38 PM
ఈ వేసవి దేశ ప్రజలను విపరీతంగా అల్లాడించింది. అసాధారణంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు ఊపిరి ఆడకుండా చేశాయి. దీంతో చాలా మంది పగటిపూట బయటకు రావడం తగ్గించేశారు. డబ్బులు ఉన్న వాళ్లు ఏసీలను, కూలర్లను ఆశ్రయించారు. అయితే పేద వాళ్లు మాత్రం ఫ్యాన్లతోనే సరిపెట్టుకున్నారు.
ఈ వేసవి (Summer) దేశ ప్రజలను విపరీతంగా అల్లాడించింది. అసాధారణంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు ఊపిరి ఆడకుండా చేశాయి. దీంతో చాలా మంది పగటిపూట బయటకు రావడం తగ్గించేశారు. డబ్బులు ఉన్న వాళ్లు ఏసీలను, కూలర్లను ఆశ్రయించారు (Coolers). అయితే పేద వాళ్లు మాత్రం ఫ్యాన్లతోనే సరిపెట్టుకున్నారు. కానీ, కొందరు తమ తెలివి తేటలను ఉపయోగించుకుని విభిన్నంగా సేద తీరారు. వెరైటీ కూలర్లను (Jugaad Coolers) తయారు చేసుకున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
sharpfactmind అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి ఇటుకలు, సిమెంట్ ఉపయోగించి ఇంటి బయట వెరైటీ కూలర్ రెడీ చేశాడు. ఐదు బస్తాల సిమెంట్, కొద్దిగా ఇసుక, సిమెంట్ మాత్రమే ఉపయోగించి ఓ ట్యాంక్‌లా కట్టారు (Brick Cooler). ఆ ఇటుకల పైన పైపులను ఏర్పాటు చేశారు. ట్యాంక్ లోపల ఉండే నీటిని ఆ పైపుల ద్వారా సప్లై చేసి ఇటుకులను తడుపుతున్నారు. తడిసిన ఇటుకలు మంచి చల్లదనాన్ని అందిస్తాయి. ఆ ట్యాంక్ బయట ఓ ఫ్యాన్ ఏర్పాటు చేశారు. దీంతో చల్లగాలి వస్తుంది.
ఆ ట్యాంక్‌లో ఒకసారి నీటిని నింపితే మూడు రోజులు నింపాల్సిన పని లేదు. ఈ జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 29 లక్షల మంది వీక్షించారు. దాదాపు 92 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ఏసీ కంటే ఉత్తమం``, ``మంచి ఆలోచన``, ```చెట్లు నాటితే ఈ బాధలన్నీ ఉండవు కదా``, ``గొప్ప తెలివి బ్రదర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 11 , 2024 | 12:38 PM