Viral Video: వావ్.. మ్యాగీని ఇలా కూడా తయారు చేయవచ్చా? రోటీ మ్యాగీతో ఆరోగ్యం అంటున్న నెటిజన్లు..
ABN, Publish Date - Oct 07 , 2024 | 05:03 PM
హాస్టల్స్‌లో, అద్దె గదుల్లో నివసించే బ్యాచిలర్స్ మాత్రమే కాదు.. చాలా ఇళ్ల కూడా మ్యాగీ తప్పక ఉంటుంది. ఇప్పటి వరకు మ్యాగీని చాలా రకాలుగా తయారు చేయడాన్ని మీరు చూసి ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి వెరైటీగా మ్యాగీని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు కొదవ లేదు. నిమిషాల్లోనే రెడీ చేసే మ్యాగీ (Maggi) అంటే చాలా మంది ఇష్టపడతారు. రుచితో పాటు సులభంగా చేసుకోగలగడం వల్ల మ్యాగీని చాలా మంది ఇష్టపడతారు. హాస్టల్స్‌లో, అద్దె గదుల్లో నివసించే బ్యాచిలర్స్ మాత్రమే కాదు.. చాలా ఇళ్ల కూడా మ్యాగీ తప్పక ఉంటుంది. ఇప్పటి వరకు మ్యాగీని చాలా రకాలుగా తయారు చేయడాన్ని మీరు చూసి ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి వెరైటీగా మ్యాగీని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మిగిలిపోయిన చపాతీలతో (Rotis) అతడు మ్యాగీ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
dietitianmacsingh అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఇంట్లో ముందు రోజు రాత్రి మిగిలిపోయిన చపాతీలను తీసుకుని వాటిని సన్నగా మ్యాగీ న్యూడిల్స్ తరహాలో కట్ చేశాడు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేశాడు. ఆ తర్వాత ఆ పాన్‌లో ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొన్ని మసాలా దినుసులు వేసి బాగా కలిపాడు. ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన చపాతీ ముక్కలను వేశాడు. నూడిల్స్ తరహాలో ఉన్న ఆ చపాతీ ముక్కలను తిన్నాడు. ఈ రోటీ మ్యాగీ (Roti Maggi ) చాలా ఆరోగ్యవంతమైనదని పేర్కొన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వెరైటీ రోటీ మ్యాగీపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆహారాన్ని వృథా చేయకుండా ఇదో కొత్త ప్రయోగం``, ``ఆరోగ్యకర మ్యాగీ``, ``సర్దార్ జీ క్రియేటివిటీ అమోఘం``, ``త్వరగా పూర్తవడమే కాకుండా వెయిట్ లాస్‌కు కూడా ఈ మ్యాగీ బాగా ఉపయోగపడుతుంది``, ``నేను కూడా ఇలా ట్రై చేస్తా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ గుహలో ఓ కుక్క దాక్కుంది.. 5 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..
Viral Video: సింహం బోనులో చెయ్యి పెడితే.. ఓ మూర్ఖుడికి తగిన శాస్తి చేసిన మృగరాజు.. వీడియో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 07 , 2024 | 05:03 PM