ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పదో తరగతి పాస్ అయినందుకు ఊరేగింపు.. గ్రామస్థులు అంత ఆనంద పడడం వెనుక కారణం తెలిస్తే..

ABN, Publish Date - May 31 , 2024 | 03:18 PM

పదో తరగతి పాస్ కావడం ఏ విద్యార్థికైనా ఎంతో సంతోషం కలిగించే విషయమే. మంచి మార్కులు సాధిస్తే ఆ విద్యార్థితో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంబర పడతారు. తమ ఆనందాన్ని చుట్టు పక్కల వారితో పంచుకుంటారు. అయితే ఓ వ్యక్తి పదో తరగతి పాస్ అయినందుకు ఊరు ఊరంతా పండగ చేసుకుంది.

10th class

పదో తరగతి (10th Class) పాస్ కావడం ఏ విద్యార్థికైనా ఎంతో సంతోషం కలిగించే విషయమే. మంచి మార్కులు సాధిస్తే ఆ విద్యార్థితో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంబర పడతారు. తమ ఆనందాన్ని చుట్టు పక్కల వారితో పంచుకుంటారు. అయితే ఓ వ్యక్తి పదో తరగతి పాస్ (10th Class Pass) అయినందుకు ఊరు ఊరంతా పండగ చేసుకుంది. మంగళవాయిద్యాల మధ్య అతడిని ఊరేగిస్తూ సంతోషపడింది. ఎందుకంటే ఆ వ్యక్తి పదో తరగతి పాస్ కావడానికి ఎంతో కష్టపడ్డాడు. 10 సార్లు ఫెయిల్ అయి 11వ సారి పాస్ అయ్యాడు (Viral News).


మహారాష్ట్ర (Maharashtra)లోని బీడ్ ప్రాంతానికి చెందిన కృష్ణ ముండే అనే వ్యక్తి పట్టుదలకు మారు పేరుగా నిలిచాడు. పదో తరగతి పాస్ కావడమే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. 10 సార్లు ఫెయిల్ అయినా నిరాశపడకుండా ప్రయత్నించి పదకొండో సారి ఉత్తీర్ణుడయ్యాడు. 2018లో కృష్ణ తొలిసారి పదో తరగతి పరీక్ష రాశాడు. అప్పుడు ఫెయిల్ అయ్యాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు 5 సంవత్సరాలలో 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఈ ఏడాది మాత్రం బాగా పరీక్ష రాసి పాస్ అయ్యాడు.


``కృష్ణ పదిసార్లు ఫెయిల్ అయినా, నేను పరీక్ష ఫీజ్ కడుతూనే ఉన్నాను. అతడికి పాస్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని అనుకున్నా`` అని అతడి తండ్రి నామ్‌దేవ్ పేర్కొన్నాడు. కృష్ణ పాస్ కావడంతో నామ్‌దేవ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కృష్ణ తండ్రి మాత్రమే కాదు.. గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కృష్ణ పాస్ అయ్యాడని తెలిసాక అతడి తండ్రి ఊరేగింపు ఏర్పాటు చేశాడు. గ్రామస్తులు డ్రమ్స్ పట్టుకుని అతడితో పాటు సంబరాలు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

Pakistan: పాకిస్తాన్‌లో నెపోటిజం ఈ రేంజ్‌లో ఉంటుంది మరి.. ఆజమ్ ఖాన్ ఎంపికపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!


Viral Video: వేటాడే ముందు పులి ఎంత సహనంగా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2024 | 03:18 PM

Advertising
Advertising