ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: బాస్‌కు ఊహించని షాకిచ్చిన ఉద్యోగి.. ఒక్క మెసేజ్‌తోనే కథ ఫినిష్..!

ABN, Publish Date - Feb 17 , 2024 | 07:36 PM

చివరి నిమిషంలో బాస్ చేసిన పనికి తిక్కరేగడంతో ఓ ఉద్యోగి అప్పటికప్పుడు జాబ్‌కు రాజీనామా చేసేశాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చివరి నిమిషంలో బాస్ చేసిన పనికి తిక్కరేగడంతో ఓ ఉద్యోగి అప్పటికప్పుడు జాబ్‌కు రాజీనామా చేసేశాడు. ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral News) మారింది. ఈ జమానాలో ఉద్యోగులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో చెప్పే ఓ టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ మైఖేల్ శాంఛెస్ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

Viral: ఛి ఛీ.. బాత్రూమ్‌లో అతడి డర్టీ పని చూసి మహిళకు షాక్.. అసలేం జరిగిందో తెలిస్తే..


అతడు తెలిపిన వివరాల ప్రకారం, నోయెల్ అనే ఆస్ట్రేలియా వ్యక్తి స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితమే అతడు తన సోదరుడి వివాహానికి వెళ్లేందుకు మూడు వారాల సెలవు తీసుకున్నాడు. ఇందుకు బాస్ కూడా అంగీకరించాడు. వివాహం ఇండోనేషియాలో ఉండటంతో నోయెల్ తన కుటుంబం కోసం హోటళ్లు, విమానం టిక్కెట్లు బుక్ చేసేశాడు. ప్రయాణానికి సరిగ్గా వారం ఉందనంగా బాస్‌ నోయెల్‌కు మెసేజ్ పెట్టి అతడి లీవ్ క్యాన్సిల్ చేసినట్టు చెప్పాడు. మరో ఉద్యోగి రాజీనామా చేయడంతో తతిమావారందరినీ ఆఫీసులకు రప్పి్స్తున్నట్టు చెప్పాడు. నోయెల్ ఇందుకు ససేమిరా అనడంతో మూడు వారాల లీవును మూడు రోజులకు కుదించుకోమని బాస్ సలహా ఇచ్చాడు. మూడు వారాల పాటు బాలీలో ఉండి చేసేదేముందని ఎదురు ప్రశ్నించాడు. బాస్ తీరుతో విసిగిపోయిన అతడు తాను రాజీనామా చేస్తున్నట్టు ఓ మెసేజ్ పెట్టి అక్కడితో సంభాషణ్ ముగించేశాడు (Man Quits Job After Boss Tries To Cancel Annual Leave).

Viral: రాత్రంతా కారు కిటికీ తెరిచే ఉంచాడు.. మరుసటి రోజు కారులో ఏసీ ఆన్ చేస్తే భారీ షాక్!


కాగా, టిక్‌టాకర్ శాంచెజ్ పంచుకున్న ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద చర్చే జరిగింది. అనేక మంది నోయెల్‌కు మద్దతు పలికారు. ఏడు నెలల ముందుగానే కేటాయించిన సెలవులను చివరి నిమిషంలో రద్దు చేయడం చాలా పెద్ద తప్పని చెప్పారు. ఇలాంటి బాస్‌లతో ఇలాగే ఉండాలంటూ తేల్చి చెప్పారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య ఈ అంశంపై నెట్టింట పెద్ద రచ్చే జరుగుతోంది.

Viral: ఈ తండ్రి కష్టం చూస్తే కన్నీళ్లాగవు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో ఇది!

మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 07:44 PM

Advertising
Advertising