ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: ఆ సింహాలకు ఎంత అవమానం?.. రోడ్డు మీద పడుక్కున్న రెండు సింహాల మధ్య నుంచి ఎలా వెళ్లాడో చూస్తే..

ABN, Publish Date - Jun 05 , 2024 | 04:01 PM

అడవిలోని సింహాలను చూస్తే సాధారణ మనుషులే కాదు.. పెద్ద పెద్ద జంతువులు కూడా భయంతో వణికిపోతాయి. క్రూర జంతువులు కూడా తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సింహాల నుంచి తప్పించుకుంటాయి.

Lions

అడవిలోని సింహాలను (Lions) చూస్తే సాధారణ మనుషులే కాదు.. పెద్ద పెద్ద జంతువులు కూడా భయంతో వణికిపోతాయి. క్రూర జంతువులు కూడా తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సింహాల నుంచి తప్పించుకుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Lion Videos) చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలో ఓ వ్యక్తి అసమాన ధైర్యంతో రెండు సింహాల మధ్య నుంచి బైక్ డ్రైవ్ చేశాడు. ఆ సింహాలు పైకి లేచే సరికి వెళ్లిపోయాడు (Viral Video).


wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను దక్షిణాఫ్రికాలో చిత్రీకరించారు. అడవిలో సఫారీ టూర్‌కు వెళ్లిన జీప్‌లు రోడ్డుపై ఆగి ఉన్నాయి. అక్కడే రెండు సింహాలు రోడ్డుకు అటూ ఇటూ పడుక్కుని ఉన్నాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్ (Bike) మీద ఆ రెండు సింహాల మధ్య నుంచి వేగంగా వెళ్లాడు. ఆ సమయంలో రెండు సింహాలు లేచి పైకి చూశాయి. అయితే ఆ సింహాలు ఆ వ్యక్తిని వెంటాడే ప్రయత్నం చేయలేదు. దీంతో అతడు బతికిపోయాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ రెండు సింహాలు అప్పుడే భోజనం చేసి ఉంటాయి``, ``ఏమైనా తేడా జరిగి ఉంటే ఆ వ్యక్తి ఉండేవాడు కాదు``, ``ఆ సింహాలను ఘోరంగా అవమానించాడు``, ``సింహాలతో ఆటలు.. గొప్ప ధైర్యం``, ``చిరుతలతో అలాంటి సాహసం చేయకూడదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: నాగుపాము ముందు హీరోయిజం చూపిద్దామనుకుంటే అలాగే ఉంటుంది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!


Viral Video: చివరి వరకు కలిసే ఉండాలని ఒట్టేసుకున్నారు.. తర్వాత వారి పరిస్థితి ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2024 | 04:28 PM

Advertising
Advertising