మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బిజీ రోడ్డు మీద గేదెతో స్టంట్.. హర్యానా యువకుడి వింత చేష్టలు.. ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Mar 31 , 2024 | 05:17 PM

తాజాగా ఓ యువకుడు గేదె మీద సవారీ చేసి వీడియో రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.

Viral Video: బిజీ రోడ్డు మీద గేదెతో స్టంట్.. హర్యానా యువకుడి వింత చేష్టలు.. ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తీవ్రమైన కాంక్షతో కొందరు వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. వ్యూస్, లైక్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు గేదె (Buffalo) మీద సవారీ చేసి వీడియో రికార్డ్ చేసుకున్నాడు. ఆ వీడియోను (Viral Video) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. bull_rider_077 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Buffalo Ride).

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు హర్యానాలోని రద్దీగా ఉండే రహదారి మీద గేదెపై కూర్చుని సవారీ చేస్తున్నాడు. గేదె వేగంగా పరిగెత్తుతున్న సమయంలో ఆ రోడ్డుపై ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 27 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

``పెట్రోల్ అక్కర్లేదు, లైసెన్స్ అక్కర్లేదు``, ``ఇలాంటి రీల్స్‌కు దయచేసి ఎవరూ లైక్ కొట్టకండి``, ``గేదె మీద యమరాజులా ఉన్నాడు``, ``ఇది జంతు హింస``, ``ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులకు ప్రమాదం``, ``ఇది తీవ్ర నిర్లక్ష్యం``, ``ఇతడిని వెంటనే అరెస్ట్ చేయాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూాడా చదవండి..

Viral Video: బాబోయ్.. పాములను మార్కెట్లో ఇలా అమ్ముతున్నాడేంటి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Viral Video: పులికి దొరికిపోయిన జింక.. శరీరాన్ని ఒడ్డుకు ఎలా ఈడ్చుకెళుతోందో చూడండి.. వీడియో వైరల్!

Updated Date - Mar 31 , 2024 | 05:17 PM

Advertising
Advertising