Viral Video: ప్రేయసితో కలిసి స్కూటీపై వెళ్తున్న భర్త.. అతడి భార్య ఎలాంటి షాకిచ్చిందంటే.. వీడియో వైరల్..
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:37 PM
వేరొక మహిళతో కలిసి స్కూటీ మీద వెళ్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరినీ స్కూటీ మీద నుంచి కిందకు తోసేసి తన ప్రతాపం చూపించింది. కారులో కూర్చున్న వారి కొడుకు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
చక్కగా ప్రియురాలితో (Girlfriend) కలిసి జాలీ ట్రిప్‌నకు వెళ్తున్న భర్త (Husband)కు భార్య (Wife) భారీ షాకిచ్చింది. జాతీయ రహదారిపై వారిని ఆపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరినీ స్కూటీ మీద నుంచి కిందకు తోసేసి తన ప్రతాపం చూపించింది. కారులో కూర్చున్న వారి కొడుకు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. తమ స్పందనలను తెలియజేస్తున్నారు (Viral Video).
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ కారు జాతీయ రహదారిపై ఆగి ఉంది. ఆ కారులో నుంచి దిగిన మహిళ అటు వైపు స్కూటీ మీద వస్తున్న ఓ జంటను ఆపింది. రోడ్డు మీద కనిపించిన భార్యను చూసి భర్త ఆశ్చర్యపోయాడు. వారి మధ్య తోపులాట జరగడంతో స్కూటీ మీద నుంచి ఇద్దరూ కింద పడిపోయారు. భర్తతో గొడవకు దిగిన భార్య.. అతడి ప్రియురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆమె మొహానికి కట్టుకున్న స్కార్ఫ్‌ను తొలగించేందుకు ప్రయత్నించింది. కారులో కూర్చున్న కొడుకును బయటకు పిలిచి.. ``చూడు మీ నాన్న ఎలాంటి పనులు చేస్తున్నాడో`` అంటూ కేకలు వేసింది.
ఆ కుర్రాడు కారులో కూర్చుని ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.5 లక్షల మందికి పైగా వీక్షించారు. 3.5 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. `` అంత జరుగుతున్నా ఆ వ్యక్తి తన కళ్లజోడు సరి చేసుకుంటున్నాడు``, ``భార్యకు దొరికిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి సిగ్గుపడడం లేదు``, ``ఆమె పరిస్థితి ఏంటి``, ``ఇది రీల్ కోసం చేసిన వీడియో కాదు కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..
IQ Test: మీ తెలివికి సవాల్.. ఈ ఫుట్‌బాల్ గేమ్‌లోని తప్పును 10 సెకెన్లలో కనుక్కోండి..
Viral Video: నర్సరీ టీచర్ల అంకిత భావానికి హ్యాట్సాఫ్.. ఫన్నీ టమాటా రైమ్ వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 04 , 2024 | 12:37 PM