Pakistan: పాకిస్తాన్ యూట్యూబర్‌పై చున్నీ కప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. ఆమె షాకింగ్ రియాక్షన్ ఏంటంటే..
ABN, Publish Date - Apr 20 , 2024 | 04:18 PM
ఓ మహిళా యూట్యూబర్‌కు సుద్దులు చెప్పాలని ప్రయత్నించిన వ్యక్తికి ఆమె తగిన సమాధానం ఇచ్చింది. తనకు చున్నీ కప్పాలని ప్రయత్నించిన వ్యక్తికి నవ్వుతూనే గట్టిగా సమాధానం చెప్పింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ మహిళా యూట్యూబర్‌కు (Pakistani YouTuber) సుద్దులు చెప్పాలని ప్రయత్నించిన వ్యక్తికి ఆమె తగిన సమాధానం ఇచ్చింది. తనకు చున్నీ (Dupatta) కప్పాలని ప్రయత్నించిన వ్యక్తికి నవ్వుతూనే గట్టిగా సమాధానం చెప్పింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ ఇంటర్వ్యూ చేస్తోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు (Viral Video).
పాకిస్తాన్ (Pakistan)లో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ ఇంటర్వ్యూ చేస్తుండగా ఓ వ్యక్తి.. తన మెడలో ఉన్న శాలువా తీసి ఆమెపై కప్పాడు. మనం ఇస్లామిక్ దేశంలో ఉన్నామని, సాంప్రదాయం ప్రకారం మహిళలు తలను కప్పి ఉంచుకోవాలని ఆమెకు సూచించాడు. మొదట షాక్ అయిన ఆ మహిళ ఆ తర్వాత ఆ వ్యక్తికి దీటుగా బదులిచ్చింది. తనపై శాలువాను తీసి అతడికి ఇచ్చేసింది. ``ఇస్లాం మీకు బోధించేది ఇదేనా? అనుమతి లేకుండా పరాయి స్త్రీని తాకవచ్చా? ఇది సామాజిక అణిచివేత. ఈ కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు`` అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``దుప్పట్టా వేసుకోవాలా? వద్దా? అనేది ఆమె వ్యక్తిగత ఇష్టం``, ``ప్రపంచాన్ని మత ఛాందసవాదం నుంచి విముక్తి చేయాలి``, ``ఇలాంటి కట్టుబాట్ల వల్లే పాకిస్తాన్ అలా వెనుకబడి ఉండిపోతోంది``, ``ఇది మహిళలపై సాంప్రదాయం పేరుతో చేస్తున్న దాడి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెద్దపులికి అయినా ఈ కష్టం తప్పదు.. నీటిలో పెద్ద పులి ఆపసోపాలు ఎందుకోసం అంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 20 , 2024 | 04:18 PM