ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: బెడ్‌రూంలో భరించలేని దుర్గంధం! ఏం జరిగిందా అని చెక్ చేస్తే..

ABN, Publish Date - May 10 , 2024 | 07:57 PM

తమ ఇంట్లోని ఓ బెడ్‌రూంలో ఏకంగా మ్యాన్‌హోల్ బయటపడటం ఇద్దరు వ్యక్తులను షాక్‌కు గురిచేసింది. ఇంటిబయట ఉండాల్సి ఏర్పాటు ఇంట్లో ఎందుకు పెట్టారో వారికి అర్థంకాలేదు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చాలా సందర్భాల్లో తమ చుట్టూ ఏం జరుగుతోందనేది చాలా మందికి తెలియదు. సొంత ఇంట్లోని సీక్రెట్స్ గురించి కూడా తెలిసే అవకాశం ఉండదు. అవి బయటపడినప్పుడు మాత్రం నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. ఇద్దరు యువకుల జీవితంలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో కొన్ని బెడ్ రూమ్స్ ఉన్నాయి. అయితే, ఇటీవల ఆ ఇంట్లో దుర్వాసన రావడం ప్రారంభమైంది. కారణం ఏంటో ఇద్దరికీ అంతుబట్టలేదు. చివరకు ఇది వారి మధ్య తగాదాలకూ దారి తీసింది. ఈ క్రమంలో ఓ రోజు వారు తమ ఇంటికి రిపేర్ చేస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Viral: నల్ల మాస్కు వేసుకున్నారని ప్రైవేటు స్కూలు నుంచి డిబార్.. ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం


రిపేర్ సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోని బెడ్‌రూంలోకి వెళ్లి కార్పెట్ ఎత్తి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తెల్లబోయాడు. కార్పెట్ కింద ఏకంగా మ్యాన్‌హోల్ కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. దానిపై తుప్పు పట్టిన ఇనుప మూత తీసి చూడగా మూరుగు నీరు పోయే పైపు కనిపించింది. దీంతో, అతడు షాకైపోయారు.

ఈ ఉదంతం నెట్టింట బాట పట్టడంతో నెటిజన్లు కూడా షాకైపోతున్నారు. అసలు బెడ్‌రూంలో మ్యాన్‌హోల్ ఎందుకు ఏర్పాటు చేశారో ఎవరికీ అంతుబట్టలేదు. ఇంటి బయట ఉండాల్సింది ఇంటి లోపల ఉండటం ఏంటని అనేక మంది ప్రశ్నించారు. ఆ ఇంట్లో ఇంకా ఏయే సీక్రెట్స్ దాగున్నాయో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిశుభ్రత లేని ఇలాంటి ఇళ్లల్లో ఉంటే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read Viral and Telugu News

Updated Date - May 10 , 2024 | 08:02 PM

Advertising
Advertising