ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కామెడీ కాకపోతే మరేంటి..? కుట్టు మెషిన్‌ను తిప్పడం కోసం ఇంత తతంగం అవసరమా?

ABN, Publish Date - Jul 17 , 2024 | 10:32 AM

కొందరు వ్యక్తులు తమ తెలివితేటలను ఉపయోగించి చాలా కష్టమైన పనులకు చాలా సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలు కనిపెడతారు. మరికొందరు అధిక తెలివి తేటలు వాటి చాలా సులభంగా జరిగిపోయే పనులను చాలా కష్ట సాధ్యంగా మారుస్తుంటారు. అలాంటి వారిని చూస్తే నవ్వు రాక తప్పదు.

jugaad trick

కొందరు వ్యక్తులు తమ తెలివితేటలను (Intelligence) ఉపయోగించి చాలా కష్టమైన పనులకు చాలా సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలు కనిపెడతారు. మరికొందరు అధిక తెలివి తేటలు వాటి చాలా సులభంగా జరిగిపోయే పనులను చాలా కష్ట సాధ్యంగా మారుస్తుంటారు. అలాంటి వారిని చూస్తే నవ్వు రాక తప్పదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తూ చూసే వారిని ఆశ్చర్యపరుస్తోంది. malikzahoor అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి కుట్టు మిషన్ (sewing machine) దగ్గర బట్టలు పట్టుకుని కూర్చున్నాడు. ఆ కుట్టు మిషన్‌ను ఓ తాడు ద్వారా డీజిల్ ఇంజిన్‌కు (Diesel engine) అనుసంధానం చేశారు. రెండో వ్యక్తి డీజిల్ ఇంజిన్‌ను ఆన్ చేశాడు. దాంతో ఆ ఇంజిన్ చక్రం తిరుగుతుండగా, దానికి కట్టిన తాడు ద్వారా కుట్టు మిషిన్ కూడా తిరుగుతోంది. చాలా వేగంగా బట్టలు కుట్టడానికి వీలవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 80 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇంత కష్టం ఎందుకు సోదరా? కరెంట్ ఫుట్ ఆపరేటర్ కొంటే సరిపోతుంది కదా``, ``ఇలాంటి టెక్నిక్‌లు పాకిస్తాన్‌లోనే సాధ్యం``, ``కరెంట్ కంటే డీజిల్ చాలా ఖరీదు కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. ద్వాపర యుగం నాటి సీన్ రిపీట్.. ఆవుల ముందు నెమలి నాట్యం ఎలా చేసిందో చూడండి..!


Optical Illusion: ఏకాగ్రతతో వెతికితే తప్ప ఈ ఫొటోలోని కేక్ పీస్ పట్టుకోలేరు.. 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 17 , 2024 | 10:32 AM

Advertising
Advertising
<