ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వావ్.. పామును ఎలా హిప్నటైజ్ చేస్తున్నాడో చూడండి.. పాములు పట్టే టెక్నిక్ ఇదేనన్నమాట!

ABN, Publish Date - Jul 09 , 2024 | 01:35 PM

పాములంటే భయపడని వారు ఉండరు. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. అయితే కొద్ది మంది మాత్రమే పాములతో భయం లేకుండా వ్యవహరిస్తుంటారు.

Snake catching

పాములంటే (Snakes) భయపడని వారు ఉండరు. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. అయితే కొద్ది మంది మాత్రమే పాములతో భయం లేకుండా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా పాములు పట్టే వాళ్లు (Snake catchers) అద్భుతమైన టెక్నిక్‌తో వాటిని పట్టుకుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి ఏకంగా పామునే హిప్నటైజ్ చేస్తున్నాడు. తన ట్యాలెంట్‌తో పామును పట్టుకుని వెళ్లిపోయాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


degaulepanda అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ భారీ విష సర్పం కనిపిస్తోంది. అది పడగవిప్పి బుసలు కొడుతోంది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఏవో మాటలు మాట్లాడుతూ దాని దగ్గరగా వెళ్లాడు. నోట్లో నుంచి పొగ వదులుతూ చేయి ఆ పాము పడగ వెనుక పెట్టాడు. సూటిగా పాము కళ్లలోకి చూస్తూ దానిని హిప్నటైజ్ చేశాడు. ఆ వ్యక్తి మాయలో పడిన పాము కాస్త అజాగ్రత్తగా మారిపోయింది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తి పాము తల పట్టేసుకున్నాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వ్యూస్ వచ్చాయి. 1.5 లక్షలకు పైగా లైక్‌లు లభించాయి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ``ఇది ఆఫ్రికన్ మాయాజాలం``, ``ఇది అద్బుతమైన ట్యాలెంట్``, ``మూగ జీవాలపై ఇలాంటి క్రూరత్వం అవసరమా``, ``ఆ పాము టైమ్ బాగాలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది.. బట్టలను ఆరబెట్టడానికి ఈ మహిళ వాడుతున్న టెక్నిక్ చూడండి..


Optical Illusion: ఈ ఫొటోలో ఉన్న చేపను 5 సెకెన్లలో కనిపెడితే మీవి హెచ్‌డీ కళ్లు అని నమ్మవచ్చు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2024 | 02:29 PM

Advertising
Advertising
<