Viral Video: ఇదెక్కడి ట్రిక్కు రా నాయనా.. స్కాన్ చేస్తే బైక్ నుంచి టీ వచ్చేస్తోంది.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ABN, Publish Date - Apr 09 , 2024 | 07:13 PM
ఈ ప్రపంచంలో చాలా మంది కాఫీ, టీలను ఇష్టపడుతుంటారు. చాలా మంది తమ రోజును కాఫీ లేదా టీతో ప్రారంభిస్తుంటారు. ఇంట్లో, ఆఫీస్‌లో, జర్నీలో కూడా కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవక తప్పదు.
ఈ ప్రపంచంలో చాలా మంది కాఫీ, టీలను ఇష్టపడుతుంటారు. చాలా మంది తమ రోజును కాఫీ లేదా టీ (Tea)తో ప్రారంభిస్తుంటారు. ఇంట్లో, ఆఫీస్‌లో, జర్నీలో కూడా కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవకతప్పదు. ఎందుకంటే ఆ వీడియోలో టీ బైక్ నుంచి వస్తోంది. అడిగినప్పుడల్లా టీ బయటకు వచ్చేలా పవర్ ఫుల్ సిస్టమ్‌ని ఆ వ్యక్తి తన బైక్ లో అమర్చుకున్నాడు (Tea from Bike). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను (Jugaad Video) సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బైక్ కనిపిస్తోంది. ఆ బైక్ వెనుక నెంబర్ ప్లేట్‌పై ఓ క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన మొబైల్‌తో కోడ్‌ను స్కాన్ చేయగానే అది తెరుచుకుని లోపలి నుంచి టీ వస్తోంది. ఆ టీని గ్లాస్‌లో పట్టుకున్న ఆ వ్యక్తి చక్కగా తాగుతున్నాడు. ఆ బైక్ నెంబర్ ప్లేట్‌పై హర్యానా రాష్ట్రానికి చెందిన నెంబర్ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియో లక్షల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది. దాదాపు 70 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కాఫీ, టీ ప్రియులకు ఈ టెక్నాలజీ ఓ వరం``, ``ఇదెలా సాధ్యం``, ``ఈ ఏర్పాటు చేసిన వ్యక్తికి నాసా నుంచి ఫోన్స్ వచ్చి ఉంటాయి``, ``ఎలన్ మస్క్ కూడా ఈ వ్యక్తికి ఫోన్ చేసి ఉంటాడు`` అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రచారం చేస్తున్న అభ్యర్థి.. కారణం ఏంటో తెలిస్తే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 09 , 2024 | 07:13 PM