Viral Video: బాబూ.. అది కొండచిలువ అనుకున్నావా? బల్లి అనుకున్నావా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూస్తే షాక్..
ABN, Publish Date - Oct 12 , 2024 | 05:16 PM
సాధారణంగా చాలా మందికి పామును చూస్తేనే భయం వేస్తుంది. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. మరి, కొండచిలువ సంగతి చెప్పనే అక్కర్లేదు. భారీ శరీరంతో ఉండే కొండచిలువ పేరు వింటేనే చాలా మంది వణికిపోతారు.
ఒక్క కాటుతో మనిషిని చంపగల పాములతో (Snake) చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ధైర్యం ఉంటే తప్ప పాముల జోలికి వెళ్లకూడదు. సాధారణంగా చాలా మందికి పామును చూస్తేనే భయం వేస్తుంది. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. మరి, కొండచిలువ (Python) సంగతి చెప్పనే అక్కర్లేదు. భారీ శరీరంతో ఉండే కొండచిలువ పేరు వింటేనే చాలా మంది వణికిపోతారు. అయితే అలాంటి కొండచిలువను పట్టుకోవడానికి ఓ వ్యక్తి ప్రయత్నించిన తీరు చూస్తే జాలి కలుగుతుంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో చూస్తే ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
ig.kumail_ali అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇంట్లోకి దూరిన ఓ కొండచిలువను పట్టుకోవడానికి ఓ వ్యక్తి రంగంలోకి దిగాడు. కేవలం ఓ టార్చ్‌లైట్, చేతికి ఓ కవర్ కట్టుకుని కొండచిలువ కోసం వెతకడం ప్రారంభించాడు. బాల్కనీ పైన ఉన్న రేకుపై వెతికాడు. అక్కడ లేదనుకుని ఆ రేకును ఒక్కసారిగా పైకి ఎత్తాడు. అత్యంత వేగంగా కొండచిలువ దూసుకొచ్చి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ వ్యక్తి రెప్పపాటు కాలంలో తన తలను కిందకు దించి ప్రాణాలను కాపాడుకున్నాడు. అతి భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఏడు కోట్ల మందికి పైగా వీక్షించారు. 2.10 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతను నిజంగా కొండచిలువను పట్టుకోవడానికే వెళ్లాడా``, ``అతడు హెల్మెట్ పెట్టుకోవాల్సింది``, ``కొండచిలువ వేగం చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం``, ``ఈ వీడియో చూసేటపుడు మీ ఫోన్‌ను జాగ్రత్తగా పట్టుకోండి``, ``అత్యంత భయంకర వీడియో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 12 , 2024 | 05:17 PM