Viral: ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మెసేజ్.. రూ.220 కట్ అయినట్టు ఫాస్టాగ్ మెసేజ్.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Aug 17 , 2024 | 08:32 AM
ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ తగ్గింది. టోల్‌ప్లాజాల దగ్గరకు వాహనం వెళ్లగానే ఫాస్టాగ్ కోడ్ స్కాన్ అయి ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. అయితే పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది.
ఫాస్టాగ్ (FASTag) అమల్లోకి వచ్చిన తర్వాత టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ తగ్గింది. టోల్‌ప్లాజా (Toll Plaza)ల దగ్గరకు వాహనం వెళ్లగానే ఫాస్టాగ్ కోడ్ స్కాన్ అయి ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. అయితే పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. అతను ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నా అతడి అకౌంట్ నుంచి ఫాస్టాగ్ పేరుతో డబ్బులు కట్ అయ్యాయి. ఈ వ్యక్తి టోల్‌కు సంబంధించిన తన అనుభవాన్ని ``ఎక్స్`` ద్వారా పంచుకున్నాడు. అతడి ట్వీట్‌పై ఫాస్టాగ్ కూడా స్పందించింది (Viral News).
పంజాబ్ (Punjab)కు చెందిన సుందర్‌దీప్ అనే వ్యక్తి ఈ నెల 14వ తేదీన ఇంట్లోనే ఉన్నప్పుడు అతడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఫాస్టాగ్ ఖాతా నుంచి రూ. 220 విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. లాడోవాల్ టోల్ ప్లాజా నుంచి ఆ అమౌంట్ కట్ అయినట్టు తెలిసింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. దాదాపు నెల రోజుల నుంచి తాను ఆ మార్గంలో వెళ్లలేదని, అయినా డబ్బులు కట్ అయ్యాయని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. 220 విత్‌డ్రా అయిన తర్వాత ఫాస్టాగ్ ఖాతాలో రూ. 790 మిగిలి ఉన్నట్లు కనిపిస్తున్న స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు.
సుందర్ దీప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ ట్వీట్‌పై ఫాస్టాగ్ కూడా స్పందించింది. బ్యాంక్ కస్టమర్ సర్వీస్ డెస్క్‌ను వీలైనంత త్వరగా సంప్రదించాలని సూచించింది. ఆయన ఫిర్యాదుపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సుందర్ దీప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 6.5 లక్షల మంది ఈ పోస్ట్‌ను వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 17 , 2024 | 09:51 AM