Viral Video: వామ్మో.. ఏనుగుకు కోపం వస్తే ఇలా ఉంటుందా? ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తికి ఎలా బుద్ధి చెప్పిందో చూడండి..
ABN, Publish Date - Apr 13 , 2024 | 04:09 PM
ఏనుగులు సాధారణంగా సాధు జంతువులు. పైగా మనుషులకు బాగా మచ్చికవుతాయి. అనవసరంగా మనుషులు, ఇతర జంతువుల జోలికి వెళ్లవు. అయితే అతిగా ప్రవర్తించి వాటికి కోపం, చిరాకు తెప్పిస్తే మాత్రం తగిన బుద్ధి చెబుతాయి. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.
ఏనుగులు (Elephant) సాధారణంగా సాధు జంతువులు. పైగా మనుషులకు బాగా మచ్చికవుతాయి. అనవసరంగా మనుషులు, ఇతర జంతువుల జోలికి వెళ్లవు. అయితే అతిగా ప్రవర్తించి వాటికి కోపం, చిరాకు తెప్పిస్తే మాత్రం తగిన బుద్ధి చెబుతాయి. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. vikram_sir_saralganit అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏనుగు దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లి కొన్ని ఆకులు ఇచ్చాడు. అతడి నుంచి ఏనుగు ఆకులను తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆ ఏనుగుతో తనకు మంచి సఖ్యత ఉందని చాటుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. బాగా దగ్గరకు వెళ్లి ఏనుగు తొండాన్ని నిమిరేందుకు ప్రయత్నించాడు. దీంతో ఏనుగుకు చిరాకు వేసి అతడిని తొండంతో విసిరికొట్టింది. దెబ్బకు ఆ వ్యక్తి దూరంగా ఎగిరి పడ్డాడు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 2.1 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``రెండు రూపాయల విలువైన ఆకులు ఇచ్చి యజమానిలా ఫోజు కొట్టాడు``, ``అడవి జంతువులను ఒంటరిగా వదిలేయండి``, ``తోక ఊపుతున్న ఏనుగు దగ్గరకు ఎప్పుడూ వెళ్లకూడదు``, ``ఆ ఏనుగు తగిన బుద్ధి చెప్పింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోల్లోని తప్పులను కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 13 , 2024 | 04:09 PM