ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: నడిరోడ్డు మీద కార్‌తో ఛేజింగ్.. పంజాబ్‌లో ఓ మహిళకు భయంకర అనుభవం.. వీడియో వైరల్!

ABN, Publish Date - May 11 , 2024 | 03:52 PM

పంజాబ్‌లో జాతీయ రహదారి NH-1 పై ఒంటరిగా కారులో వెళ్తున్న ఓ మహిళా టీచర్‌కు భయంకర అనుభవం ఎదురైంది. దాదాపు ఏడు కిలోమీటర్లు ఆమెను కొందరు దుండగులు వెంబడించారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమె భయంభయంగా కారు నడుపుతూనే ఆ ఘటనను వీడియో తీసింది.

Car Chasing

పంజాబ్‌లో జాతీయ రహదారి NH-1 పై ఒంటరిగా కారులో వెళ్తున్న ఓ మహిళా టీచర్‌కు భయంకర అనుభవం ఎదురైంది. దాదాపు ఏడు కిలోమీటర్లు ఆమెను కొందరు దుండగులు వెంబడించారు (Car Chasing). ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆమె భయంభయంగా కారు నడుపుతూనే ఆ ఘటనను వీడియో తీసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్విటర్‌లో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).


హర్మీన్ సోచ్ అనే మహిళ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆ మహిళ ప్రయాణిస్తున్న కారును ఓ స్కార్పియో ఫాలో అవుతోంది. అందులోని దుండగులు ఆమె కారును వెనుక నుంచి వెంబడించడం లేదా ముందుకు వచ్చి ఆమె డ్రైవింగ్‌కు ఆటంకం కలిగించడం వంటివి చేశారు. ఏడు కిలోమీటర్ల పాటు వారు అలా ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆమె ఆ ఘటనను వీడియో తీసింది. ఆమె పెట్రోల్ బంకుకు వెళ్లినపుడు కూడా వారు ముందుకు వెళ్లి వెయిట్ చేశారు. తాను పోలీసులకు కాల్ చేయాలా లేక ముందుకు వెళ్లాలా అని ఆలోచించినట్టు హర్మీన్ తెలిపింది.


పురుషులు వినోదంగా భావించేది చాలా సార్లు మహిళలకు చాలా భయంకరంగా ఉంటుందని హార్మిన్ పేర్కొన్నారు. ఈ వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. ఆ కారులోని వ్యక్తులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``మీరు వెంటనే 100కి డయల్ చేసి ఉండాల్సింది``, ``మహిళల భద్రత కోసం మరింత కఠినమైన నిబంధనలు రూపొందించాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అతిథులకు భోజనం పెట్టే విషయంలో భారతీయులకు ఎవరూ సాటి రారట.. వీడియో వైరల్!


Viral Video: పెళ్లి వేడుకలో కాబోయే భార్యకు షాకిచ్చిన వరుడు.. ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేేయండి..

Updated Date - May 11 , 2024 | 03:52 PM

Advertising
Advertising