Viral: అకస్మాత్తుగా భార్య అదృశ్యం! అడవిలోకి వెళ్లి వెతికితే..
ABN, Publish Date - Jun 09 , 2024 | 04:08 PM
ఇండోనేషియాకు చెందిన ఓ వివాహిత అనూహ్యంగా కొండచిలువకు బలైపోయింది. ఆమె ఆచూకీ కోసం మూడు రోజుల పాటు వెతికి భర్తకు ఆమె మృతదేహం కొండచిలువ పొట్టలో లభించింది. ఈ విషయం ప్రస్తుతం స్థానికంగానే కాకుండా ప్రపంచమంతా వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సాయంత్రం ఇంటికి రావాల్సిన భార్య ఎంతకీ రాకపోవడంతో ఆమె భర్తకు టెన్షన్ మొదలైంది. ఆ తరువాత మూడు రోజుల వరకూ ఆమె ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు, స్థానికుల సాయంతో గ్రామ పరిసరాల్లో, చుట్టూ ఉన్న అడవిలో వెతుకుతుండగా కదల్లేని స్థితిలో ఓ భారీ కొండ చిలువ కనిపించింది. దాని పొట్ట ఉబ్బెత్తుగా ఉంది. అప్పటికే మనసు ఏదో కీడు శంకించింది. చివరకు జరిగిన దారుణం వెలుగులోకి రావడంతో ఆమె భర్త గుండె చెరవైంది. ఇండోనేషియాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: గుడ్లను తింటున్న పాము! ఏం చేయలేక నిస్సహాయంగా బాతులు! ఇంతలో సడెన్‌గా..
పూర్తి వివరాల్లోకి వెళితే, సులవేసీ ప్రావిన్స్‌లోని కాలెంపాంగ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఫరీదాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం ఎప్పటిలాగే పనిమీద బయటకు వెళ్లిన ఆమె ఆ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో, భర్త పోలీసులు , స్థానికుల సాయంతో గాలింపు చర్యలకు దిగాడు. గ్రామంలో పాటు సమీపంలో అడవిలో కూడా వెతికాడు. ఈ క్రమంలో అడవిలో ఓ చోట అతడికి భార్య వస్తువులు కనిపించాయి. దీంతో, ఆ ప్రాంతమంతా జల్లెడపట్టగా ఓ భారీ కొంచ చిలువ కదలలేని స్థితిలో కనిపించింది. దాని ఉదర భాగం ఉబ్బెత్తుగా ఉండటం చూసి అతడి మనసు ఏదో కీడు శించింది. చివరకు పాము పొట్ట కోసి చూడగా భార్య మృతదేహం కనిపించడంతో అతడు షాకైపోయాడు. దుస్తులతో సహా ఆమెను పాము అమాంతంగా మింగేసిందని తెలిసి గొల్లుమన్నాడు (Missing Indonesian woman found dead inside 16-foot-long python after 3 days).
కొండచిలువలు మనుషులపై దాడి చేయడం చాలా అరుదని అక్కడి జంతు శాస్త్రజ్ఞలు చెబుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో మాత్రం మనుషులను కొండ చిలువలు పొట్టన పెట్టుకున్న ఘటనలు పలు వెలుగు చూశాయని చెబుతున్నారు. గతేడాది ఓ రైతును చంపబోతున్న ఎనిమిది మీటర్ల పొడవున్న పామును గ్రామస్తులు గుర్తించి మట్టుపెట్టారు. అంతకుమును ఏడాది కూడా మరో రైతు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. పామ్ ఆయిల్ తోటల్లో అతడిని ఓ పాము సజీవంగా పొట్టన పెట్టుకున్నట్టు ఆ తరువాత బయటపడింది. 2018లో ఓ మహిళ ఇలాగే కొండచిలువకు ఆహారమైపోయింది.
Updated Date - Jun 09 , 2024 | 04:09 PM