ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Money Saving Tips: ఈ 5 పద్దతులలో డబ్బు సేవ్ చేయండి.. నెల ఆఖరు వరకు డబ్బుకు లోటుండదు..!

ABN, Publish Date - Jun 24 , 2024 | 04:19 PM

చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్య.. నెల ఆఖరు లోపే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవడం. ఈ నెల ఆఖరు రోజుల్లో ఎవైనా ఖర్చులకైనా, ఎమర్జెన్సీ అవసరాలకు అయినా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 5 పద్దతులలో డబ్బును ఆదా చేస్తుంటే

డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు పొదుపు చేయడం కూడా ఒక కళ. డబ్బు ఆదా చేసే విషయంలో మగవారి కంటే మహిళలే కాస్త మెరుగ్గా ఉంటారు. చాలా వరకు ఇంటి ఖర్చుల గురించి మహిళలే చూసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్య.. నెల ఆఖరు లోపే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవడం. ఈ నెల ఆఖరు రోజుల్లో ఎవైనా ఖర్చులకైనా, ఎమర్జెన్సీ అవసరాలకు అయినా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 5 పద్దతులలో డబ్బును ఆదా చేస్తుంటే నెల ఆఖరు వరకు ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఈ పొదుపు చిట్కాలేంటో తెలుసుకుంటే..

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


డబ్బు ఆదా చేయడానికి మొదటి అడుగు డబ్బు ఎక్కడ ఖర్చు చేయబడుతుందో తెలుసుకోవడం. బిల్లులు, కిరాణా సామాగ్రి, ఏవైనా ఇతర ఇంటి ఖర్చులతో సహా నెలవారీ ఖర్చులన్నింటితో బడ్జెట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కడ తగ్గించుకోవచ్చు, డబ్బు ఎక్కడ ఆదా చేసుకోవచ్చో తెలుసుకోవడానికి ఇది సహాయం చేస్తుంది.

బడ్జెట్‌ను ప్లాన్ చేసుకున్న తరువాత ఏ ఖర్చు అనవసరంగా చేస్తున్నాం, దేనికి అంత ఉపయోగం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది గమనించుకోవాలి. ఎక్కువ ఖర్చు పెడుతున్న చోట వీలైతే తక్కువ ఖర్చుతో పనులు జరిగే వీలుందేమో చూడాలి. ప్రస్తుత కాలంలో తక్కువ ఖర్చుతో నాణ్యతతో కూడిన అవసరాలు కూడా తీరుతాయి. అలాంటివి ఎంచుకోవాలి. అంత అవసరం లేని విషయాలలో డాబు కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం ఆపాలి. అంతే కాదు బయట తినే బదులు ఇంట్లోనే వండుకోవచ్చా? బయట ఆధారపడే పనులను స్వంతంగా చేసుకునే వీలుందా లాంటివన్నీ ఖర్చు తగ్గించడంలో సహాయపడతాయి.

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!


ఇంటి కోసం కొనుగోలు చేసే వస్తువులు, కిరాణా షాపుల్లో కొనుగోలు చేయడం వంటి చోట్ల బేరసారాలు చేయడానికి నామోషీగా ఫీల్ కాకూడదు. వీలైనప్పుడల్లా కూపన్లను ఉపయోగించాలి. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లి కొనడానికి బదులు మన్నికగా చవగ్గా దొరికే చోట కొనాలి. వస్తువులు ఎక్కువ కాలం మన్నిక వచ్చే విధంగా ఉన్నవి కొనుగోలు చేయాలి.

ఎట్టి పరిస్థితులలోనూ దేనికి అప్పు చేయడం మంచిది కాదు. దాని బదులుగా బడ్జెట్ ప్లాన్ చేసుకుని డబ్బును ఉపయోగించాలి. డబ్బు మిగలడం మొదలైనప్పుడు కొత్త వస్తువులు కొనడానికి ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ప్లానింగ్ లేకుండా కొత్త వస్తువులు కొంటే బడ్జెట్ ప్లాన్ పాడవుతుంది. అప్పు చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇంట్లో ప్రతి ఒక్క చోట పొదుపు చేయవచ్చు. అవసరం లేని సమయంలో లైట్స్ ఆఫ్ చేయడం, నీటి ఖర్చు, అదే పనిగా బయటకు వెళ్లడం, బయటి ఆహారం, అంత ముఖ్యం కాకపోయినా పార్టీలు ఇవ్వడం, ఉపయోగం లేకపోయినా ఖరీదైన వస్తువులు, గ్యాడ్జెట్లు కొనడం వంటి వాటి వల్ల డబ్బు ఖర్చు పెరుగుతుంది. వీటన్నింటిని గుర్తించి డబ్బు పొదుపు చేసుకుంటే నెలాఖరు వరకు బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోదు.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Updated Date - Jun 24 , 2024 | 04:25 PM

Advertising
Advertising