Viral Video: కుక్కలతో ముంగిస భీకర ఫైట్.. పొలాల్లో జరిగిన ఈ సూపర్ యాక్షన్ సీన్ చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Nov 10 , 2024 | 10:27 AM
పాములు, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే ముంగిసలు పాములతోనే కాదు ఇతర జంతువులతో కూడా ధైర్యంగానే తలపడతాయి. తాజాగా ముడు కుక్కలను ఓ ముంగిస భయపెట్టింది. పొలంలో జరిగిన ఆ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనుషులను, క్రూరమృగాలను కూడా భయపెట్టే భయంకర విష సర్పాలు (Snakes) ముంగిసలకు (Mongoose) భయపడతాయి. పాములు, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే ముంగిసలు పాములతోనే కాదు ఇతర జంతువులతో కూడా ధైర్యంగానే తలపడతాయి. తాజాగా ముడు కుక్కలను ఓ ముంగిస భయపెట్టింది (Mongoose fight with dogs). పొలంలో జరిగిన ఆ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు (Viral Video).
@MojClips అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. మూడు కుక్కలు పొలంలో ఉన్న ఓ ముంగిస వెంట పడ్డాయి. దానిని చంపడానికి ప్రయత్నించాయి. అయితే ఆ ముంగిస ధైర్యంగా ఎదురు నిలిచింది. రెండు సార్లు కుక్క నోటికి చిక్కినా పట్టు వదల్లేదు. కుక్కలపై ఎదురు దాడికి దిగి వాటిని భయపెట్టింది. దీంతో కుక్కలు వెనకడుగు వేశాయి. ఆ దృశ్యం చూడడానికి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్‌ను తలపించింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ ఫైటింగ్ WWE కంటే తక్కువ కాదు``, ``ఆ ముంగిస యాక్షన్ హీరోను తలపిస్తోంది``, ``అద్భుతమైన పోరాటం``, ``ముంగిస చనిపోయే వరకు ఓటమిని అంగీకరించదు``, ``మూడు కుక్కలకు ఒకేసారి జవాబు చెబుతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పాపా.. అవి నీళ్లు కావు.. పెట్రోల్.. బంక్ దగ్గర ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి..
Viral Video: వెరీ ఫన్నీ.. ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ ఎంత పని చేసింది.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Video: ఆశ్చర్యం.. భక్తురాలి జోలికి వెళ్లని పాము.. షాకింగ్ వీడియోపై నెటిజన్ల కామెంట్లు ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 10 , 2024 | 10:27 AM