ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shocking Video: చిరుత కంట పడితే మామూలుగా ఉండదు.. కోతిని ఎలా వేటాడిందో చూడండి..

ABN, Publish Date - Mar 23 , 2024 | 05:13 PM

సింహం, పులి, హైనా వంటి ఎంతటి క్రూర మృగాలకైనా కోతులు చిక్కవు. అయితే చిరుతల ముందు మాత్రం కోతుల ఆటలు సాగవు.

సాధారణంగా కోతులను (Monkey) వేటాడడం ఎంతటి వన్య మృగాలకైనా కష్టమే. కోతులు చెట్ల మీదకు ఎక్కడం, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు అతి వేగంగా దూకడం చేస్తూ క్రూర మృగాల నుంచి తమను తాము కాపాడుకుంటాయి. సింహం, పులి, హైనా వంటి ఎంతటి క్రూర మృగాలకైనా కోతులు చిక్కవు. అయితే చిరుతల (Leopard) ముందు మాత్రం కోతుల ఆటలు సాగవు. చిరుతలు అతి వేగంగా పరుగులు పెట్టడమే కాదు.. చెట్లు ఎక్కడంలో కూడా ఎక్స్‌పర్ట్‌లు (Hunting Videos).

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) చిరుత అతి వేగంగా పరిగెత్తి కోతిని వేటాడింది. ranthambhorepark అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. రణతంబోర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు జంగిల్ సఫారీ టూర్‌కు వెళ్లిన పర్యాటకులు ఈ ఘటనను వీడియో తీశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతిని చిరుత వేటాడుతోంది. కోతి వేగంగా పరిగెడుతుండగా, దానిని అందుకునేందుకు చిరుత మరంత వేగంగా తరుముతోంది. చివరకు ఓ చెట్టు దగ్గర ఆ కోతిని పట్టుకుంది.

Viral Video: ఏం తెలివి అన్నా.. ఆటోలో పైప్ ఎందుకు బిగించాడో తెలిస్తే.. సలాం కొట్టకుండా ఉండలేరు!

ఆ కోతిని అక్కడే చంపేసి నోటితో పట్టుకుని అడవిలోకి పారిపోయింది. చిరుత వేటాడే సమయంలో పర్యాటకులు కేకలు పెట్టారు. అయినా ఆ చిరుత తన వేట నుంచి దృష్టి మళ్లించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పర్యాటకులు సైలెంట్‌గా ఉంటే మరింత బాగుండేది``, ``వన్య ప్రాణుల వేట చూడడం చాలా గొప్ప విషయం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 23 , 2024 | 05:13 PM

Advertising
Advertising