ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈ కోతిని చూసి టేబుల్ మేనర్స్ నేర్చుకోవాలి.. కుర్చీలో కూర్చుని ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్!

ABN, Publish Date - May 05 , 2024 | 03:22 PM

మనుషులు కోతుల నుంచే పరిణామం చెందారని, కోతులు, మనుషుల మధ్య కొన్ని లక్షణాలు సారూప్యంగా ఉంటాయని చాలా మంది నిపుణులు చెబుతుంటారు. చాలా కోతులు మనుషులను అనుకరించి వారిలా ప్రవర్తిస్తుంటాయి. చాలా సార్లు మనుషులనే తలపిస్తుంటాయి.

Monkey eating food

మనుషులు కోతుల (Monkeys) నుంచే పరిణామం చెందారని, కోతులు, మనుషుల మధ్య కొన్ని లక్షణాలు సారూప్యంగా ఉంటాయని చాలా మంది నిపుణులు చెబుతుంటారు. చాలా కోతులు మనుషులను అనుకరించి వారిలా ప్రవర్తిస్తుంటాయి. చాలా సార్లు మనుషులనే తలపిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఆ వీడియోలోని ఓ కోతి పూర్తిగా మనిషిలా మారిపోయి చక్కగా టేబుల్ మీద భోజనం చేస్తోంది (Viral Video).


chalobiharghume అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక కోతి హాయిగా కుర్చీపై కూర్చుని టేబుల్‌పై ప్లేట్‌లో ఉన్న అన్నం తింటోంది. పప్పు, అన్నం, కూరలు ఉన్న ప్లేట్ ముందు కూర్చున్న కోతి చాలా తీరికగా భోజనం చేస్తోంది. అయితే ఆ కోతి మరొకరికి వడ్డించిన ఆహారాన్ని తింటున్నట్టు అనిపిస్తోంది. ఈ వీడియోను వెనుక నుంచి తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Monkey eating meals).


ఆ వీడియోను మిలియన్ మందికి పైగా వీక్షించారు. రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ వీడియో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దృష్టిని కూడా ఆకర్షించింది``, ``ఆ కోతి టేబుల్ మేనర్స్ నా కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి``, ``కోతి అలా తినడం చాలా బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కుండ నీరు బాగా చల్లగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.. వైరల్ అవుతున్న వీడియో!

Puzzle: మీ పరిశీలనా శక్తికి అసలైన పరీక్ష.. ఈ ప్లే గ్రౌండ్‌లో టీపాట్ ఎక్కడుందో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2024 | 03:22 PM

Advertising
Advertising