Viral Video: తల్లి మనసు అలాగే ఉంటుంది.. పిల్లలను రక్షించుకునేందుకు ఓ నాగుపాము ఏం చేస్తోందో చూడండి..
ABN, Publish Date - May 07 , 2024 | 10:20 AM
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. పాము చాలా క్రూరమైనది, పాలు పోసినా అది కాటు వేస్తుందని అంటుంటారు. అలాంటి పాములో కూడా మాతృత్వం ఉంటుందని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నిరూపిస్తోంది.
ఈ ప్రపంచంలో ఎక్కువ మంది పాములంటే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. పాము చాలా క్రూరమైనది, పాలు పోసినా అది కాటు వేస్తుందని అంటుంటారు. అలాంటి పాములో కూడా మాతృత్వం ఉంటుందని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Snake Video) నిరూపిస్తోంది. ఆ వీడియోలో ఓ పాము తన పిల్లలను రక్షణ కవచంగా నిలిచి కాపాడుకుంటోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది (Viral Video).
murliwalehausla24 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పాము తన గుడ్లకు రక్షణగా నిల్చుంది (Cobra guarding her eggs). గుడ్లు అన్ని ఓ గొయ్యిలో ఉండగా, దానిపై పాము పడగ విప్పి కూర్చుంది. పాముల సంరక్షకుడు మురళీ వాలే ఆ పామును, గుడ్లను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే తన గుడ్లకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడిన పాము బుసలు కొడుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు 60 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``పాము కూడా నిజమైన తల్లిలా ప్రవర్తించింది``, ``తల్లి ప్రేమ అలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. సాధారణంగా ఆడ పాములు తమ గుడ్లకు రక్షణగా ఉంటాయి. గుడ్లను పొదిగే సమయంలో తమ గూళ్ళను జాగ్రత్తగా కాపాడుకుంటాయి. సాధారణంగా ఈ కాలం 75-100 రోజులు ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఢిల్లీలో ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్న పదేళ్ల బాలుడు.. ఆ బాలుడి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 07 , 2024 | 10:20 AM