ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elephant: తప్పిపోయిన పిల్ల ఏనుగును తల్లి వద్దకు చేర్చగానే.. ఫారెస్ట్ సిబ్బందికి కనిపించిన అరుదైన దృశ్యం..

ABN, Publish Date - Jan 03 , 2024 | 04:01 PM

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. తల్లి లేకుండా పిల్లలు ఉంటారేమో గానీ.. తల్లి మాత్రం పిల్లలను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందుకే...

మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. తల్లి లేకుండా పిల్లలు ఉంటారేమో గానీ.. తల్లి మాత్రం పిల్లలను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందుకే ప్రపంచంలో తల్లి ప్రేమకు మించినది మరోటి లేదు అని పెద్దలు అంటుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇటీవల తప్పిపోయిన పిల్ల ఏనుగును అటవీ సిబ్బంది ఎంతో శ్రమించి తల్లి వద్దకు చేర్చిన విషయం తెలిసిందే. అయితే పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు నిద్రపోతున్న ఓ సన్నివేశానికి సబంధించిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తమిళనాడు (Tamil Nadu) పొల్లాచ్చికి సమీపంలోని అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో (Annamalai Tiger Reserve) పిల్ల ఏనుగు తప్పిపోయిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్ 30న 4-5 నెలల వయసున్న అడవి ఏనుగు తల్లి ఏనుగు నుంచి తప్పిపోయింది. మంద నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు (baby elephant) ఎటు వెళ్లాలో తెలీని పరిస్థితిలో తిరుగుతూ ఫారెస్ట్ సిబ్బంది కంటపడింది. పిల్ల ఏనుగును ఎలాగైనా తల్లి ఏనుగు వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో వారు తీవ్రంగా శ్రమించారు. . పిల్ల ఏనుగును ట్రక్కులోకి ఎక్కించి.. వాగులు, వంకలు దాటించారు. అప్పటికీ తల్లి జాడ దొరకలేదు. చివరకు డ్రోన్ల సాయంతో 3 కిలోమీటర్ల దూరంలోని ఏనుగుల మందను గుర్తించారు. చివరకు ఎట్టకేలకు పిల్ల ఏనుగును తల్లి వద్దకు చేర్చారు.

Viral Video: ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకున్నారు.. అయినా తెలిసి తెలిసి చేసిన చిన్న తప్పుతో చివరకు ఏమైందో చూడండి..

అప్పటికే పిల్ల ఏనుగు కోసం వెతుకుతూ ఉన్న తల్లి ఏనుగు దాన్ని చూడగానే ప్రేమతో అక్కున చేర్చుకుంది. తర్వాత అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో అలసిపోయిన ఏనుగు.. తన పిల్ల ఏనుగుతో కలిసి ఓ పెద్ద బండరాయి పక్కనే నిద్రకు ఉపక్రమించింది. మళ్లీ తన పిల్ల ఎక్కడ తప్పిపోతుందే అనే భయంతో.. తొండంతో పిల్ల ఏనుగును పట్టుకుని, తన కాలిని తలగడలా చేసింది. ఈ దృశ్యాన్ని చూసి చలించినపోయిన అటవీ సిబ్బంది ఫొటో తీసి, సోషల్ మీడియాలో ఫేర్ చేశారు. ఈ చిత్రాన్ని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహూ.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హృదయాన్ని అత్తుకునే దృశ్యం’’.. అంటూ కొందరు, ‘‘అటవీ సిబ్బంది శ్రమ మరువలేనిది’’.. అంటూ మరికొందరు, ‘‘తల్లీబిడ్డల అనుబంధానికి ప్రతీకగా ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Rare Bird: ఆ రెండు లక్షణాలూ ఉన్న అత్యంత అరుదైన పక్షి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

Updated Date - Jan 03 , 2024 | 04:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising