ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఎంత పని చేశావు తల్లీ! కన్నబిడ్డల బాగోగులు పట్టించుకోకుండా..

ABN, Publish Date - Jun 11 , 2024 | 04:56 PM

సోషల్ మీడియా మోజులో పడ్డ వివాహిత భర్త మందలించాడని ఆత్మహత్యకు పాల్పడింది. తన కన్న బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించక బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని సమాచారమంతా కళ్లముందు ఉంచే సోషల్ మీడియా విషయంలో జాగ్రత్త వహించపోతే జీవితాలే తలకిందులవుతాయి. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి సోషల్ మీడియాపై అప్రమత్త వహించకపోతే అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఇది నిజమని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది (Viral).

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. ఆమెకు వివాహమై పన్నెండేళ్లు కావస్తోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆమె ఇన్‌స్టా రీల్స్‌కు బాగా అలవాటు పడిపోయింది. అదో వ్యసనంలా మారింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి (Mother of two dies ends life after husband asks her not to use Instagram ).

Viral: మనసు మాట విని ఏకంగా రూ.20 కోట్లు కొల్లగొట్టాడు! ఎలాగో తెలిస్తే..


సోమవారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో, క్షణికావేశానికి లోనైన ఆమె ఓ గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య చేసిన పనికి షాకైపోయిన భర్త చివరకు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్థానికుల్లో కూడా విచారం వ్యక్తమవుతోంది. కన్నబిడ్డల బాగోగుల కూడా చూడకుండా క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 04:57 PM

Advertising
Advertising