Online: ఆన్‌లైన్‌లో రూ.93,000 మేకను ఆర్డర్ పెట్టాడు.. చివరకు ఎలా బకరా అయ్యాడో తెలిస్తే అవాక్కవుతారు..
ABN, Publish Date - Jan 16 , 2024 | 07:40 PM
కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల, అగ్గిపుల్లా.. కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత చందంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్గిపుల్ల మొదలుకుని ఏ నిత్యవసర వస్తువు కావాలన్నా
కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల, అగ్గిపుల్లా.. కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత చందంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్గిపుల్ల మొదలుకుని ఏ నిత్యవసర వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా ఆర్డర్ పెట్టేయగానే.. అలా ఇంటికి వచ్చిపడుతున్నాయి. దీంతో ఎక్కువ శాతం ఆన్‌లైన్ ఆర్డర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో అంతే స్థాయిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తికి వింత సమస్య వచ్చి పడింది. సదరు వ్యక్తి ఓ మేకను ఏకంగా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేశాడు. ఒక్క మేకను ఏకంగా రూ.93000లకు కొని చివరకు ఎలా బకరా అయ్యాడంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. ముంబైకి (Mumbai) చెందిన మహ్మద్ ఖురేషీ అనే వ్యక్తికి.. అందరిలాగానే ఆన్‌లైన్ షాపింగ్ (Online shopping) చేయడం అలవాటు. ఇతడు వ్యవసాయ క్షేత్రాన్ని (Agricultural field) నడుపుతుంటాడు. దీంతో అతడు ఇటీవల మంచి మేకను కొనాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే ఆన్‌లైన్‌లో (Online) సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో అతడికి ఓ వెబ్‌సైట్‌లో రూ.86,695ల విలువ చేసే మేక (goat) బాగా నచ్చింది. దీంతో వెంటనే వారిని సంప్రదించి ఆర్డర్ చేశాడు. రవాణా రుసుము రూ.6,600తో కలిపి మొత్తం రూ.93,295లకు కొన్నాడు.
అయితే డబ్బులు మొత్తం ముందే ఇవ్వాలని అవతలి వ్యక్తులు చెప్పడంతో మొత్తం డబ్బులను ఒకేసారి గూగుల్ పే ద్వారా జనవరి 2న పంపించాడు. మేకను డెలివరీ చేస్తామని, ముంబైలోని విక్రోలి ప్రాంతంలోని జంక్షన్‌లో వేచి చూడమని చెప్పారు. దీంతో మహ్మద్.. వారు చెప్పిన ప్రాంతంలో మేక కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అయితే ఎంత సేపు ఎదురుచూసినా మేక మాత్రం రాలేదు. దీంతో చివరకు వారికి ఫోన్ చేస్తే నంబర్ పని చేయలేదు. మోసపోయానని తెలుసుకున్న అతను.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆన్‌లైన్ ఆర్డర్లు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘మేకను కొనబోయి.. చివరకు బకరా అయ్యాడన్నమాట’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Jan 16 , 2024 | 07:40 PM