ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అర్ధరాత్రి మద్యం మత్తులో కారు ఎక్కిన యువతి.. చివరకు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN, Publish Date - Jan 05 , 2024 | 06:01 PM

ప్రస్తుత కాలంలో యువతీయువకులు చాలా మంది చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువతులు కూడా యువకులతో పోటీ పడి మరీ మద్యం, డ్రగ్స్ తదితర చెడు వ్యసనాలకు బానిసలవడం చూస్తూ ఉన్నాం. కొందరు..

ప్రస్తుత కాలంలో యువతీయువకులు చాలా మంది చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు యువతులు కూడా యువకులతో పోటీ పడి మరీ మద్యం, డ్రగ్స్ తదితర చెడు వ్యసనాలకు బానిసలవడం చూస్తూ ఉన్నాం. కొందరు అర్ధరాత్రి కూడా తప్పతాగి రోడ్లపై తిరగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో చాలా మంది హత్యలు, అత్యాచారాలకు గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్‌గా మందు కొట్టిన ఓ యువతి అర్ధరాత్రి.. ఉబెర్ కారు ఎక్కింది. అయితే చివరకు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఏమంటున్నారంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రాత్రి సమయంలో ఫుల్‌గా (drunken woman) మందు కొట్టి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే అది సాధ్యం కాక.. చివరకు ఎలాగోలా ఉబెర్ కారు (Uber car) బుక్ చేసి ఎక్కేస్తుంది. మద్యం మత్తులో ఉన్న ఆమెను చూడగానే.. వారే వాళ్లు ఎవరైనా తప్పుడు దృష్టితోనే చూస్తారు. అయితే ఈ కారు డ్రైవర్ మాత్రం ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఇంటి గడప వరకూ తీసుకెళ్లి.. తలుపు తీయాలంటూ లోపలి వాళ్లను కోరతాడు. అయితే ఇంతలో లోపలి నుంచి ఓ మహిళ వాయిస్ వినిపిస్తుంది. డ్రైవర్ విషయం చెప్పగానే.. లోపల ఉన్న మహిళ.. ఇంటికి సంబంధించిన తాళం చెవి ఎక్కడ ఉందనే విషయాన్ని అతడికి చెబుతుంది. ఈ వీడియో ఇంతగితో ముగుస్తుంది.

Viral Video: గీజర్‌గా మారిన పొయ్యి.. ఓ వైపు వంట చేస్తుంటే.. మరోవైపు వేడినీరు ఎలా వస్తుందో చూడండి..

కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘‘సరదాకూ ఓ హద్దు ఉంటుంది... మితిమీరితో ప్రమాదం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి మంచి మనసున్న డ్రైవర్లు.. చాలా అరుదుగా ఉంటారు’’.., ‘‘మానవత్వం ఇంకా ఉందని నిరూపించాడు’’.., ‘‘ఇంటి కీ ఎక్కడుందో చెప్పే బదులు.. తలుపులు తీయొచ్చుగా’’.., ‘‘ఇంట్లో ఎవరూ లేనట్లున్నారు.. ఇంటర్‌కామ్ ద్వారా సూచించారు’’.., ‘‘ 2024 సంవత్సరంలో అంతా ఇలాంటి మంచి వారే ఉంటారని ఆశిస్తు్న్నాం’’, ‘‘రాత్రిళ్లు తాగడంతో పాటూ ఇలా అసభ్యకరంగా బయటికి వెళ్లడం చాలా తప్పు’’.., ‘‘మీరు చాలా గొప్పవారు బ్రదర్’’.. ఇలా నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 68వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అరే..! వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

Updated Date - Jan 05 , 2024 | 06:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising