ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నవతరం తువ్వాళ్లు

ABN, Publish Date - Nov 24 , 2024 | 09:44 AM

ఒళ్లు తుడుచుకునేందుకు కాటన్‌ టవల్‌ లేదంటే టర్కీ టవల్‌... ఎన్నో ఏళ్లుగా ఇవే తెలుసు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నింటిలో మార్పు వస్తున్నట్టే... చివరికి టవల్స్‌ కూడా ఆధునికం అవుతున్నాయి. పర్యావరణ స్పృహతో తయారవుతున్న బ్యాంబూ, బనానా, అలోవెరా తువ్వాళ్లు యువ తరాన్ని సుతిమెత్తగా చుట్టేస్తున్నాయి. వాటి విశేషాలే ఇవి...

ఒళ్లు తుడుచుకునేందుకు కాటన్‌ టవల్‌ లేదంటే టర్కీ టవల్‌... ఎన్నో ఏళ్లుగా ఇవే తెలుసు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నింటిలో మార్పు వస్తున్నట్టే... చివరికి టవల్స్‌ కూడా ఆధునికం అవుతున్నాయి. పర్యావరణ స్పృహతో తయారవుతున్న బ్యాంబూ, బనానా, అలోవెరా తువ్వాళ్లు యువ తరాన్ని సుతిమెత్తగా చుట్టేస్తున్నాయి. వాటి విశేషాలే ఇవి...

స్నానం చేశాకో, ముఖం కడుక్కున్నాకో ఏ టవల్‌ అయితే ఏంటీ తుడుచుకోవడానికి అనుకుంటే మీరు పాతకాలంలో ఉన్నట్టే. మార్కెట్లో సరికొత్త తువ్వాళ్లు నవతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. పైగా అవి ఆరోగ్యకరం, పర్యావరణహితం కూడా. అందుకే బ్యాంబూ, బనానా, అలోవెరా టవల్స్‌ను ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేస్తున్నారు చాలామంది. వీటికి కొన్ని ప్రత్యేక తలున్నాయి కాబట్టే ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.


- బ్యాంబూ కాటన్‌

సాధారణంగా ఇళ్ల నిర్మాణంలో, ఫర్నీచర్‌ తయారీలో మాత్రమే వాడే వెదురు ఇప్పుడు టెక్స్‌టైల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. బ్యాంబూ ఫైబర్‌, సహజమైన కాటన్‌ ఫైబర్‌ల మిశ్రమంతో తయారు చేసినవే ఈ బ్యాంబూ టవళ్లు. వెదురులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. అందుకే వెదురుతో తయారుచేసిన ఈ టవళ్లను వాడటం మేలంటున్నారు నిపుణులు. సుతిమెత్తని దారాలతో తయారైన ఈ తువ్వాళ్లు.. సున్నితమైన చర్మం కలిగిన వారికి, చర్మ సమస్యలతో బాధపడుతున్నవారికి అనుకూలంగా ఉంటాయి. పైగా ఇవి సాధారణ తువ్వాళ్ల కంటే 4 రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకోగలవు. తేలిగ్గా ఉంటాయి. ఇట్టే ఆరిపోతాయి. వీటిని స్నానం, స్విమ్మింగ్‌, జిమ్‌, స్పోర్ట్స్‌ సెషన్‌ తర్వాత ఉపయోగిస్తే... చెమటను పూర్తిగా పీల్చుకొని తాజా అనుభూతిని అందిస్తాయి. సూక్ష్మక్రిములు, దుర్వాసనను నివారిస్తాయి. బ్లీచ్‌, ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌లు లేదా బలమైన డిటర్జెంట్‌లతో వీటిని ఉతకకపోవడమే మంచిది. తేలికపాటి డిటర్జెంట్‌లతో ఉతికి, నీడలో ఆరబెడితే సరి. ఈ టవల్స్‌ను ఒక వైపు ముఖానికి, మరొక వైపు శరీరానికి ఉపయోగించుకునేందుకు వీలుగా, వీటిపై లేబుల్స్‌ అతికించి ఉంటాయి.


- అలోవెరా... ఈ విధంగా...

కలబందను సౌందర్య ఉత్పత్తుల తయారీ లోనే కాదు, ఒంటికి చుట్టుకునే తువ్వాళ్ల తయారీలోనూ వాడుతున్నాయి మార్కెట్‌ వర్గాలు. 60 శాతం అలోవెరా ఫైబర్‌, 40 శాతం కాటన్‌ ఫైబర్‌ల మిశ్రమంతో ఔషధ గుణాలున్న ఈ టవల్స్‌ను తయారు చేస్తున్నారు. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి అలర్జీ, రాషెస్‌ వంటి చర్మసమస్యల్ని దూరం చేయడంలో సహకరిస్తాయి. అందుకే మొటిమలు, చర్మ సమస్యలు, సున్నితమైన చర్మం కలిగిన వారికి ఈ తువ్వాళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మృతకణాలను తొలగించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి కూడా. ఇవి సున్నితంగా, మృదువుగా ఉండడం వల్ల బుజ్జాయిల లేలేత చర్మానికి వెచ్చదనాన్నిస్తూ, సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తాయి. నీటిని త్వరగా పీల్చుకుంటాయి. కాబట్టి తరచుగా ప్రయాణాలు చేసేవారికి ఇవి సరైనవి అంటున్నారు నిపుణులు.


- అరటి నారతో...

అరటి నార, కాటన్‌ ఫైబర్‌ మిశ్రమంతో తువ్వాళ్లు తయారవుతున్నాయి. అరటిలో అంతర్లీనంగా యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఉండడం వల్ల ఇవి చర్మానికి పూర్తి రక్షణను అందిస్తాయి. ఈ అరటి నార దారాలతో సుతిమెత్తని బాత్‌ టవల్సే కాదండోయ్‌.. ఫేస్‌, హ్యాండ్‌, హెయిర్‌, జిమ్‌, బేబీ టవల్స్‌ను కూడా రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫేస్‌ టవల్‌ చర్మాన్ని పూర్తి స్థాయిలో శుభ్రపరిస్తే, హెయిర్‌ టవల్‌ జుట్టు చిట్లి పోకుండా సున్నితంగా ఆరబెడుతుంది. వర్క వుట్‌ టవల్‌ చెమటను గ్రహించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక మృదువైన బేబీ టవల్‌ పిల్లలకు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇవి సున్నితంగా ఉంటాయి కాబట్టి అన్ని చర్మ రకాలకు సరిపోతాయి. మొత్తానికి ఈ కొత్తతరం తువ్వాళ్లు పర్యావరణ ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయనే చెప్పాలి.

Updated Date - Nov 24 , 2024 | 09:45 AM